ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలకు త్వరితగతిన సేవలందించాలి

ABN, First Publish Date - 2021-07-30T04:57:59+05:30

ప్రభుత్వ పరమైన సేవలను సచివాలయ సిబ్బంది ప్రజలకు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు.

శనివారపుపేట–3 సచివాలయంలో సిబ్బందితో మాట్లాడుతున్న డీఐజీ మోహనరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు

ఎస్పీతో కలిసి సచివాలయాల ఆకస్మిక సందర్శన

ఏలూరు క్రైం, జూలై 29 : ప్రభుత్వ పరమైన సేవలను సచివాలయ సిబ్బంది ప్రజలకు త్వరితగతిన అందించేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు రేంజ్‌ డీఐజీ కేవీ మోహనరావు ఆదేశించారు. ఏలూరు నగరం ఏలూరు రూరల్‌ ప్రాంతంలో ఉన్న సచివాలయాలను డీఐజీ మోహనరావు, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌శర్మ ఆకస్మికంగా సందర్శించారు. ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఇండోర్‌ స్టేడియం, శ్రీరామ్‌నగర్‌ 4వ రోడ్డు వద్ద ఉన్న సచివాలయాలను, ఏలూరు టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పత్తేబాద, చేపలతూము సెంటర్‌ సచివాలయా లను ఏలూరు వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తోటకూరదిబ్బల సచివాల యం, ఏలూరు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మాదేపల్లిలోని వైఎస్‌ ఆర్‌ కాలనీ సచివాలయం, పెదపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న కొత్తూరు, కొత్త ముప్పర్రు గ్రామాల సచివాలయాలను గురువారం ఉదయం నుంచి సా యం త్రం వరకూ సందర్శించారు. అక్కడ ఉన్న సిబ్బందిని వారి శాఖల పని తీరు, వారికున్న సమస్యలు, ప్రజలకు అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకు న్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించి తమ  ప్రతిఽభను చాటుకోవాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివా లయాల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బంది దిశ యాప్‌ను తమ పరిధిలోని మహిళలు, యువతుల ఆండ్రాయిడ్‌ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకునేలా అవగా హన కల్పించాలన్నారు. మహిళా పోలీస్‌ కార్యదర్శులతో మాట్లాడారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను పోలీస్‌ శాఖలో ప్రభుత్వం విలీనం చేసిందని వారికి మూడు నెలలపాటు ఐపీసీ, సీఆర్‌పీసీ శారీరక ధృడత్వంపై శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. డీఐజీ, ఎస్పీలతో పాటు ఏలూరు డీఎస్పీ డాక్టర్‌ ఒ.దిలీప్‌ కిరణ్‌,  స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ కొండలరావు, టూటౌన్‌ ఎస్‌ఐ ఎన్‌ఆర్‌ కిషోర్‌బాబు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-30T04:57:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising