ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరువు భత్యం నిలుపుదల నిరసిస్తూ ధర్నా

ABN, First Publish Date - 2021-02-27T05:28:11+05:30

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన మూడు విడతల కరువు భత్యాన్ని నిలుపుదల చేస్తూ నిర్ణయించిన కేంద్ర ప్ర భుత్వ తీరుకు నిరసనగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో జిల్లా ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు.

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న ఏపీ ఎన్జీవో నాయకులు,ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు కలెక్టరేట్‌, ఫిబ్రవరి 26: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన మూడు విడతల కరువు భత్యాన్ని నిలుపుదల చేస్తూ నిర్ణయించిన కేంద్ర ప్ర భుత్వ తీరుకు నిరసనగా అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర  ఏపీ ఎన్జీవోస్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో జిల్లా ఏపీఎన్జీవోస్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తమ నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆర్‌ఎస్‌ హరనాఽథ్‌, చోడగిరి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందా ల్సిన మూడు విడతల కరువు భత్యాన్ని నిలుపుదల చేయడం దారుణమన్నా రు. 55 శాతంతో కూడిన మెరుగైన పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్‌ చే శారు. కార్యక్రమంలో ఏలూరు తాలూకా అధ్యక్షుడు జి.శ్రీధర్‌రాజు, సహ అధ్య క్షుడు పి.శ్రీనివాసులు, నెర్సు వెంకట రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు కె.నాగ మణి, పి.సత్యనారాయణ, కె.సునీత, కె.అనూరాధ, సత్యభారతి, డి.కృష్ణవేణి, మాధురి, ఎం.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.    

ఫ ఏలూరు ఫైర్‌స్టేషన్‌ : ఉద్యోగుల పీఆర్సీ రిపోర్టును బహిర్గతం చేసి నూతన పీఆర్సీని ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జిల్లా గ్రంథాలయ సంస్థల ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.రాంబాబు డిమాండ్‌ చేశారు. జిల్లా గ్రంథాలయం వద్ద శుక్రవారం ఉద్యోగులు మధ్యాహ్న భోజన విరామ సమ యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లా డుతూ ప్రభు త్వ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేసే ఆలోచనను కేంద్ర ప్రభుత్వం విర మించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు హరనాథ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి చోడగిరి శ్రీనివాసరావు, గ్రంథాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-27T05:28:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising