ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాత్మా.. మాకు న్యాయం చెయ్యి..!

ABN, First Publish Date - 2021-10-21T04:30:16+05:30

‘మహాత్మా నువ్వైనా మాకు న్యాయం చెయ్యి.. పెండింగులో ఉన్న మా బిల్లులను మాకు ఇప్పించు’ అంటూ ప్రభుత్వ కాంట్రాక్టర్లు బుధవారం కలెక్టరేట్‌లో నిరసనకు దిగారు.

కలెక్టరేట్‌లో గాంధీజీ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న కాంట్రాక్టర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 గాంధీజీ విగ్రహానికి కాంట్రాక్టర్ల వినతి

ఏలూరు, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ‘మహాత్మా నువ్వైనా మాకు న్యాయం చెయ్యి.. పెండింగులో ఉన్న మా బిల్లులను మాకు ఇప్పించు’ అంటూ ప్రభుత్వ కాంట్రాక్టర్లు బుధవారం కలెక్టరేట్‌లో నిరసనకు దిగారు. తొలుత కలెక్టర్‌ కార్తి కేయ మిశ్రాను కలిసేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన వారు అక్కడ ఆయన లేక పోవడంతో కలెక్టర్‌ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించి తమకు న్యాయం చేయాలని కోరుతూ నిరసన తెలిపారు. ఈ సంద ర్భంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు గోలి శరత్‌ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లుగా జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన నిధులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.   లక్షల రూపాయలు అప్పులు తెచ్చి ఖర్చు చేశామని, బిల్లులు మాత్రం చెల్లించడం లేదని వాపోయారు. వడ్డీలు కట్టలేక తమ కుటుంబాలు చిన్నాభిన్నమై పోతున్నా యని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి పి.వెంకన్న, పవన్‌ కుమార్‌, ప్రసాద్‌, గణేశ్‌, మేడా ప్రసాద్‌ బ్రహ్మాజి తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-21T04:30:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising