ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆరోగ్యశ్రీలో బెడ్‌లు ఇవ్వకుంటే క్లోజ్‌

ABN, First Publish Date - 2021-05-18T05:40:28+05:30

ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి అర్హులైన కొవిడ్‌ బాధితులకు 50 శాతం పడకలు కేటాయించకపోతే నోటీసులిచ్చి బుధవా రం సాయంత్రానికి ఆయా హాస్పిటల్స్‌ను క్లోజ్‌ చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆర్డీవోలను ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, మే 5(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీకి అర్హులైన కొవిడ్‌ బాధితులకు 50 శాతం పడకలు కేటాయించకపోతే నోటీసులిచ్చి బుధవా రం సాయంత్రానికి ఆయా హాస్పిటల్స్‌ను క్లోజ్‌ చేయాలని కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా ఆర్డీవోలను ఆదేశించారు. కలెక్టరేట్‌ నుంచి సోమవారం ఆయన వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు. ఈ విషయాన్ని ఫ్లెక్సీల ద్వారా ఆయా ఆసుపత్రుల ముందు ప్రదర్శించాలని చెప్పారు. వీఆర్‌డీఎల్‌, ట్రూనాట్‌ ల్యాబ్‌ల సామర్థ్యాన్ని బట్టి నమూనాలు సేకరించాలన్నారు. మిగిలిన వారికి ర్యాపిడ్‌ కిట్స్‌ ద్వారా పరీక్షలు నిర్వహించాలన్నారు. అప్పుడే ఫలితాలు టెస్టింగ్‌ రోజునే ఇవ్వగలుగుతామన్నారు. 


బ్లాక్‌ ఫంగస్‌ కేసు గుర్తింపు

జిల్లాలో ఒక బ్లాక్‌ ఫంగస్‌ కేసు ఆదివారం వచ్చిందని, దీనిపై డాక్టర్లు, వైద్యాధి కారులు దృష్టి సారించాలని చెప్పారు. బ్లాక్‌ ఫంగస్‌ తొలుత ముక్కు ద్వారా ప్రవే శించి కంటికి, తలకు పాకుతుందని, ముఖం, కన్ను, ముక్కు భాగాలలో చురుక్కు మనే విధంగా నొప్పి రావడం దీని లక్షణమని తెలిపారు. ఆక్సిజన్‌ పెట్టినప్పుడు మాత్రమే స్టెరాయిడ్స్‌ వాడాలని స్పష్టం చేశారు. 35 ఏళ్లు దాటి, డయాబెటిస్‌ ఉన్న కొవిడ్‌ బాధితులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు సుగర్‌ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలన్నారు. కోలు కుని ఇంటికి వెళ్లాక ఏవైనా లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలన్నారు. 

Updated Date - 2021-05-18T05:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising