ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోగులకు భరోసా..!

ABN, First Publish Date - 2021-04-23T05:21:29+05:30

జిల్లాకు నూతన కలె క్టర్‌ కార్తికేయ మిశ్రా తనదైన ముద్ర వేస్తున్నారు.

ఏలూరు జిల్లా ఆసుపత్రిలో రోగి బంధువుతో మాట్లాడుతున్న కలెక్టర్‌కార్తికేయ మిశ్రా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ బాధితులతో మాట్లాడిన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా

ఏలూరు ప్రభుత్వాసుపత్రి తనిఖీ 

తల్లి బిడ్డ పడకల పెంపునకు కృషి 


ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 22 : జిల్లాకు నూతన కలె క్టర్‌ కార్తికేయ మిశ్రా తనదైన ముద్ర వేస్తున్నారు. గురువారం ఉదయం నేరుగా ఏలూరు ప్రభుత్వా సుపత్రికి వచ్చి చికిత్స పొందుతున్న బాధితుల వద్ద కు వెళ్లి మాట్లాడి భరోసా కల్పించారు. ఒక మహిళ కింద కూర్చుని ఉండగా ఆమె వద్దే ఆయన కాళ్ళ పైన కూర్చుని మీకు సదుపాయాలు ఎలా ఉన్నా యి ? వైద్య సేవలు ఎలా అందుతున్నాయి ? అని ప్రశ్నించి అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్‌ సెం టర్‌, బాలింతల వార్డు, ప్రసూతి, శిశు ఆరోగ్య కేం ద్రం వార్డులను పరిశీలించి వైద్య సేవలపై రోగుల నుంచి ఆరా తీశారు. అనంతరం ఆసుపత్రి సమన్వ యాధికారి డాక్టర్‌ ఏవీఆర్‌ మోహన్‌ నుంచి మాతా శిశు సముదాయ మౌలిక సదుపాయాలు, వైద్య సేవలను అడిగారు. అనంతరం కలెక్టర్‌ కార్తికేయ మాట్లాడుతూ ఆసుపత్రిలో బాలింతలు, గర్భిణులకు మరింత మెరుగైన వైద్య సేవలందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఏ విధంగా సాగుతుందో పరిశీలించాలన్నారు. జిల్లాలో కోవిషీల్డ్‌ మొదటి డోసు 30 వేల మందికి ఇచ్చామని, రెండవ డోసు పూర్తి చేసేం దుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇక్కడ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో పడకలు పెంచే విషయాన్ని సీఎం జగన్మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువెళతానని చెప్పారు. డీఎస్పీ డాక్టర్‌ దిలీప్‌కిరణ్‌, చీఫ్‌ గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ ఎం.పద్మ ఉన్నారు.  


104కు కాల్‌ చేయండి


ఏలూరు, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌–19 దృష్ట్యా అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరే ట్‌లో ఏర్పాటుచేసిన 104 కాల్‌ సెంటర్‌ను సద్విని యోగం చేసుకోవాలని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా గురు వారం ఓ ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ బారిన పడిన వారు ఎవరైనా వైద్యం, ఆసుపత్రిలో అడ్మి షన్లు, టెస్టులపరమైన అవసరాల నిమిత్తం ఈ కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేయవచ్చని తెలిపారు. కలెక్టరేట్‌ లోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నందు 1902ను ఏర్పాటు చేశామన్నారు. 

కాల్‌ సెంటర్లు నెంబర్లు 

08812– 222297 – 08812– 222215

08812– 222216 – 08812– 295497

Updated Date - 2021-04-23T05:21:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising