ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కు లేకుంటే రూ.100 జరిమానా : కలెక్టర్‌ మిశ్రా

ABN, First Publish Date - 2021-04-21T05:33:42+05:30

జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా మాస్కులు లేకుండా బయటికి వచ్చిన వారికి రూ.100 జరిమానా విధించనున్నామని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు.

ద్వారకా తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటున్న నూతన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా కట్టడిలో భాగంగా మాస్కులు లేకుండా బయటికి వచ్చిన వారికి రూ.100 జరిమానా విధించనున్నామని కలెక్టర్‌ కార్తికేయమిశ్రా మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నిచోట్లా విధిగా భౌతికదూ రం ఆరడుగులు పాటించడంతోపాటు సీట్ల మధ్య దూరం ఉం డేలా చూడాలని కోరారు. ప్రతి ఒక్కరూ మాస్కు, శానిటైజర్‌ను వినియోగించాలని సూచించారు. అన్ని దుకాణాలు, షాపులు, పబ్లిక్‌ ప్రాంతాల్లో థర్మల్‌ స్ర్కీనింగ్‌, శానిటైజేషన్‌, భౌతిక దూరం విధిగా పాటించేలా ఏర్పాట్లు ఉండాలన్నారు.


104కు వచ్చే ప్రతి అభ్యర్థన పరిష్కరించాలి


104కు వచ్చే ప్రతి అభ్యర్థనను పరిష్కరించాలని కలెక్టర్‌ కార్తి కేయ మిశ్రా అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన 104 కొవిడ్‌ కాల్‌ సెంటర్‌ను మంగళవారం ఆయన పరిశీ లించారు. సెంటర్‌కు వచ్చే కాల్‌ వివరాలు, చూపిన పరిష్కా రాలు, నమోదు చేసిన వివరాలు, రిజిస్టర్‌లను ఆయన పరిశీలిం చారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కొవిడ్‌ మహ మ్మారిని ఎదుర్కొనడంలో అందరూ శక్తి వంచన లేకుండా పనిచే యాలని కోరారు. జేసీ తేజ్‌భరత్‌, ట్రైనీ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డీపీవో రమేశ్‌, జిల్లా మైనారిటీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పద్మావతి, కాల్‌ సెంటర్‌ సిబ్బంది పాల్గొన్నారు.


శ్రీవారి సేవలో నూతన కలెక్టర్‌

ద్వారకా తిరుమల, ఏప్రిల్‌ 20 : శ్రీ వేంకటేశ్వర స్వామిని జిల్లా నూతన కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ప్రధాన అర్చకులు పెద్దింటి రాంబాబు, వేద పండితులు ఆశీర్వచనాలు పలికి ప్రసాదాలు అందించారు. స్వామి వారి చిత్రపటాన్ని దేవస్థానం కార్యనిర్వహణాధికారి సుబ్బారెడ్డి అందించారు. 

Updated Date - 2021-04-21T05:33:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising