ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కాష్టం

ABN, First Publish Date - 2021-05-04T05:36:23+05:30

కనిపెంచిన వారు కన్ను మూస్తే.. నా అనుకున్న బంధుమిత్రులు తుది శ్వాస విడిస్తే.. కళ్లారా చూసే పరిస్థితి లేదు. భౌతిక కాయంపై పడి తనివి తీరా ఏడ్చి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అంతిమ సంస్కారానికి ఆర్థిక భారం

ఒక్కో మృతదేహానికి రూ.20 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు 

పెరిగిన ఖర్చులతో  సామాన్యులు విలవిల


 డెల్టా ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా సోకింది. స్థానికంగా వైద్యం చేయించినప్ప టికీ పరిస్థితి మెరుగు పడలేదు. మెరుగైన వైద్యానికి విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. బంధు వులు.. భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకుని వెళ్లాలా ? శ్మశానానికి తీసుకుని వెళ్లాలా ? తర్జనభర్జన పడుతుండగా అంబులెన్స్‌ డ్రైవర్‌ దహన క్రియలకు అన్ని ఏర్పాట్లు తానే చేస్తానని చెప్పి రూ.30 వేలు వసూలు చేశాడు. 


 ఇటీవల నరసాపురంలోనే ఒకరు కొవిడ్‌తో మృతి చెందారు. మృత దేహాన్ని వాహనంలో శ్మశానానికి తరలించాలని భావించారు. ఎవరూ ముందుకు రాలేదు. చివరికి అంబు లెన్స్‌ను సంప్రదించారు. ఇందుకు రూ.8 వేలు వెచ్చించాల్సి వచ్చింది. అది కూడా మృతదేహం క్విట్‌ బ్యాగ్‌లో ఉన్నందుకు. లేకపోతే మరో రూ.ఐదు వేలు అదనంగా ఇవ్వాల్సి వచ్చేదని చెప్పాడు. 


(నరసాపురం/భీమవరం/ఏలూరు రూరల్‌):

కనిపెంచిన వారు కన్ను మూస్తే.. నా అనుకున్న బంధుమిత్రులు తుది శ్వాస విడిస్తే.. కళ్లారా చూసే పరిస్థితి లేదు. భౌతిక కాయంపై పడి తనివి తీరా ఏడ్చి.. గుండెల బరువు దించుకునే అవకాశం లేదు. పాడె భుజానికెత్తుకుని రుణం తీర్చుకునే అవకాశమూ కనిపించడం లేదు. పుట్టెడు దుఃఖంలో ఉన్న బిడ్డల భుజం తట్టి ధైర్యం చెబుదామన్నా, పది మంది చేరి బాధిత కుటుంబాలను ఓదారుద్దామన్నా ఆ సాహసం చేయలేని దుస్థితి. కరోనా మహమ్మారి పరిస్థితులనే మార్చేసింది. అయిన వారిని పోగొట్టుకుని దుఖ సాగరంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులు వారి దహన సంస్కారాలు ఎంతో భారంగా మారాయి. కరోనా మృతుల అంత్యక్రియల ప్రక్రియ యజ్ఞంలా మారింది. కరోనాతో చనిపోయిన వ్యక్తిని ఆసుపత్రి నుంచి కాని, ఇంటి నుంచి కాని శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేయడానికి పట్టణాల్లో వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. మృతుడి నివాసం నుంచి అంబులెన్స్‌లో తీసుకువెళ్లడానికి, శ్మశానంలో అంత్యక్రియలకు కట్టెలు, పెట్రోల్‌ ఖర్చులు, దహనం చేసే మనుషుల కోసం వ్యయం చేసే ఖర్చు తడిసి మోపెడవుతోంది. అంతిమ సంస్కారాలు చేసేందుకు బంధుమిత్రులు సైతం ముందుకు రాకపోవడంతో కొన్నిచోట్ల మృతదేహాలను స్వస్థలాలకు తీసుకురాలేక అక్కడే దహన సంస్కరాలు చేస్తున్నారు. అప్పటికే వైద్యానికి ఉన్నదంతా ఊడ్చి నిస్సహాయ స్థితిలో ఉంటే దహన సంస్కారాలకు వేలాది రూపాయలు తడుముకోవాల్సి వస్తోంది. ఆస్పత్రి లేదా.. ఇంటి నుంచి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకెళ్లాలంటే రూ.10 వేలు చేతిలో ఉండాల్సిందే. వెంట వెళ్లే వారి పీపీఈ కిట్‌ల ఖర్చు, కట్టెలు, అంతిమ సంస్కారాలకు చేతిలో మరో రూ.30 వేలు ఉండాల్సిందే. వైరస్‌ సోకితే వైద్యుల దగ్గర నుంచి మెడికల్‌ షాపు వరకు, అక్కడి నుంచి అంబులెన్స్‌, ఆస్పత్రి ఖర్చులు ఒక ఎత్తయితే.. చివరికి అంతిమ మజిలీకి కూడా వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

కరోనా మృతులు అత్యధికంగా ఉన్న ఏలూరు ప్రాంతంతో పాటు భీమవరం, తాడేపల్లిగూడెం, నరసాపురం, పాలకొల్లు, తణుకు, జంగారెడ్డిగూడెం వంటి పట్టణాలలో ఇప్పుడు రూ.20 వేల నుంచి 40 వేలపైగా ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఏలూరు రూరల్‌ మండలం చొదిమెళ్ళ తమ్మిలేరు స్మశాన వాటిక వద్ద రోజుకు పదికిపైగా శవ దహనాలు జరుగుతున్నాయి. భీమవరంలో కట్టెలు, పెట్రోలు వంటి ఖర్చులు భరిస్తే రూ.20 వేలు వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. అన్ని ఖర్చులు దహన నిర్వాహకులు భరిస్తే రూ.40 వేలు వరకు ఖర్చవుతున్నాయి. ఇటీవలే ఏలూరు ఆర్డీవో చేసిన కృషి వల్ల తమ్మిలేరు గట్టున, ఊరు శివారున ఆరు వేల రూపాయలతో దహన ప్రక్రియ పూర్తవుతుంది. మరోవైపు సాధారణ మరణాలకు కరోనా కష్టాలు తప్పడం లేదు. వైరస్‌ వల్ల చనిపోలేదని ఆధారాలు చూపలేకపోతున్నారు. బంధువులు భయపడుతున్నారు. బయట వారి సహాయంతో పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తోంది.


Updated Date - 2021-05-04T05:36:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising