ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతర పంటలతో ఆదాయం

ABN, First Publish Date - 2021-06-06T04:49:31+05:30

రైతులు ఎన్ని పంటలు పండించిన రక రకాల రూపంలో రైతులు నష్టాలు చూస్తూనే ఉన్నా రు.

కొబ్బరిలో అంతర పంటలుగా కోకో
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం

స్వల్పవ్యవధిలో పంట చేతికి..

కరోనా కష్టాకాలంలో అన్నదాతలకు ఆర్థిక భరోసా

దెందులూరు, జూన్‌ 5:  రైతులు ఎన్ని పంటలు పండించిన రక రకాల రూపంలో రైతులు నష్టాలు చూస్తూనే ఉన్నా రు. కరోనా సమయంలో వ్యవసాయం లాభసాటిగా మార్చుకోవడానికి ప్రస్తుత పరిస్థితుల్లో అనేక పద్ధతులు అవలంభించాల్సి ఉంది. రైతులకు పెరిగిన పెట్టుబడులు దృష్ట్యా సేద్యం కష్ట సాధ్యమైంది. సాధారణ పంటకు తోడు మధ్య ఆదాయ మార్గంగా అంతర పంటలపై రైతులు ఆసక్తి చూపిస్త్తున్నారు. వాణిజ్య పంటల్లో అంతర పంట లుగా వివిధ రకాల కూరగాయలు, పూల సాగు చేపట్టి లాభాలు ఆర్జిస్తున్నారు. వాణిజ్య పంటల రైతులు మార్కెట్‌లో ఫలసాయం అందే సమయంలో ప్రకృతి వైపరీత్యాలతో పంటలను కోల్పోవడం లేకపోతే గిట్టుబాటు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఈ అంతర పంటలు ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. ఈ పంటల సాగుతో ప్రధాన పంటకు పెట్టుబడి కోసం అప్పులు కోసం వెళ్లాల్సిన పనిలేకుండా అంతర పంటలు ఆదాయాన్నిస్తున్నా యి. దెందులూరు నియోజకవర్గంలో 3,200 ఎకరాల్లో అంతర పంటలు సాగు చేస్తున్నారు. అధికంగా చల్లచింతలపూడి, మేదినరావుపాలెం, రామారావుగూడెం, విజయరాయి, బాపిరాజుగూడెం, వేగివాడ,శ్రీరామరం, పెదవేగి గ్రామాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నా రు. వాణిజ్య పంటఅయిన కొబ్బరి తోటలో కోకో, అరటి, కంద, కొబ్బరి, పసుపు, జామ, బెండ, బంతి, మిరప, ఆకు కూరలు, వంగ, కాకర, వంటి పంటలతో పాటు పూల సాగును అంతర పంటలుగా సాగు చేస్తున్నారు.


అంతర పంటలతో మెరుగైన ఫలితాలు

కమ్మ బ్రహ్మజీ, రైతు కొత్తకమ్మవారిగూడెం 

వ్యవసాయం అంత లాభసాటిగా లేకపోయినప్పటికి భూమిని నమ్మిన రైతుగా అనేక పంటలు వేసి నష్టాలను చవి చూస్తున్నాం. అంతర పంటల వల్ల కొంత మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. కొబ్బరి తోటలో కోకో, అరటి, కూర గాయాల పంటలు, తదితర పంటలు వేయడం వల్ల తక్కువ సమయం లోనే అంతర పంట వల్ల పెట్టుబడికి మరో పంట నగదు సమకూరుతుంది. పంటల మార్పిడి, అంతర పంటలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభా ల్లొచ్చే పంటలనే రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలి.


అంతర పంటలతో తెగుళ్ల నివారణ

రమేష్‌, మండల వ్యవసాయాధికారి  

అంతర పంటలతో భూములకు, రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. రెండు పంటల ఆదాయం వల్ల రైతులకు ఆర్థిక భరోసా పెరుగుతుంది. ఈపంటల వల్ల పంటల్లో వచ్చే తెగుళ్ల వ్యాప్తి తక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం పూల సాగుతో అక్కడకు వచ్చే మేలు చేసే మిత్ర పురుగులు క్రిమికీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. దీనికి తోడు పంట మార్పిడి వల్ల భూమికి ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఈ పంటల నుంచి వచ్చే పచ్చిరొట్టతో భూసారం పెరుగుతుంది.  

Updated Date - 2021-06-06T04:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising