ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంటలో 300 శ్లోకాలు

ABN, First Publish Date - 2021-06-13T04:48:06+05:30

పవిత్ర హిందూ గ్రంధాల్లోని శ్లోకాలను చూడకుండా గంటసేపు ఆపకుండా పఠిస్తూ పెంటపాడు గ్రామానికి చెందిన 11 సంవత్సరాల బుడతడు అందరిని అబ్బురపరుస్తున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

11 ఏళ్ల బాలుడి ఘనత

పెంటపాడు, జూన్‌ 12: పవిత్ర హిందూ గ్రంధాల్లోని శ్లోకాలను చూడకుండా గంటసేపు ఆపకుండా పఠిస్తూ పెంటపాడు గ్రామానికి చెందిన 11 సంవత్సరాల బుడతడు అందరిని అబ్బురపరుస్తున్నాడు. పెంటపాడు గ్రామానికి చెందిన ద్వారంపూడి వేణుగోపాలరెడ్డి, వేణురాధారెడ్డి దంపతుల కుమారుడు పృథ్వీరెడ్డి తాడేపల్లిగూడెం శ్రీచైతన్య స్కూల్లో 5వ తరగతి చదువుతున్నాడు. చదివేది ఇంగ్లీషు మీడియం అయినప్పటికి తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను చిన్ననాటి నుంచి ఆవపోసన చేస్తున్నాడు. భగవద్గీత, ఆదిత్యహృదయం, సూర్యపుస్తకం, శివాష్టకం, శివపంచాక్షరి తదితర పుస్తకాలలోని 300 శ్లోకాలను చూడకుండా  ఏకసంతాగ్రహిగా ఆపకుండా గంటసేపు అవలీలగా చెబుతున్నాడు. అంతేకాదు తెలుగు సంగీతంలో సరిగమపదనిసలు కూడా చెబుతాడు. జాతీయ నాయకుల గీతాలకు సొంతంగా సాహిత్యాన్ని రంగరించుకుని తానే పదననిసలు సమకూర్చుకుని గానం చేస్తున్నాడు. బాలుడి తండ్రి శనివారం తన ఇంటివద్ద విలేకర్ల సమావేశం నిర్వహించాడు. పృథ్వీరెడ్డి విలేకర్ల ముందు వేదమంత్రాలను, సరిగమపదనిసలను ఆలపించాడు. తన లక్ష్యం కలెక్టర్‌ కావాలని, తెలుగుసాంప్రదాయాలు, సాహితీకళల గురించి కూడా ఇంకా అభ్యాసన చేస్తానని విలేకర్లకు వివరించాడు.


Updated Date - 2021-06-13T04:48:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising