ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతాలు ఇవ్వకుంటే పనిచేయలేం

ABN, First Publish Date - 2021-10-30T04:47:41+05:30

నగర పంచాయతీలో వార్డు వలంటీర్లకు 4 నెలలుగా జీతాలు రావడం లేదని, పనులు చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు.

నగర పంచాయతీ వద్ద వలంటీర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వార్డు వలంటీర్ల ఆందోళన

చింతలపూడి, అక్టోబరు 29: నగర పంచాయతీలో వార్డు వలంటీర్లకు 4 నెలలుగా జీతాలు రావడం లేదని, పనులు చేయలేమని ఆవేదన వ్యక్తం చేశారు. కమిషనర్‌ను శుక్రవారం కలిసి తమ గోడు వినిపించారు. నాలుగు నెలలుగా జీతాలు రావడం లేదని, తమ కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడు తున్నాయన్నారు. ప్రజా ప్రతినిధులు కాని, అధికా రులు కాని స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు వార్డు సచి వాలయాల్లో 124 మంది పని చేస్తున్నామని,  జీతాలు ఇవ్వ కుంటే ఏ విధంగా పని చేయాలని ప్రశ్నించారు. రేపటి నుంచి విధుల్లోకి రాబోమని తమకు పని చెప్పవద్దని కమిషనర్‌కు స్పష్టం చేశారు. దీనిపై కమిషనర్‌ వెంకటేశ్వరరావును ప్రశ్నించగా జీతాలు రాకపోవడం వాస్తవ మేనని, జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి సమాచారం ఇచ్చామన్నారు. జీతాలు చెల్లిస్తామని వలం టీర్లు విధులకు హాజరవుతారని చెప్పారు. 


ప్రత్యక్ష ఆందోళన చేస్తాం : సీపీఎం 

నగర పంచాయతీ పరిధిలో వలంటీర్లుకు నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకపోవడం దారుణమని సీఐటీయూ మండల అధ్యక్ష, కార్యదర్శులు నత్తా వెంకటేశ్వరరావు, బాలరాజు అన్నారు. వారి కుటుంబాలు పస్తులుంటు న్నాయని ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం శూన్యమన్నారు. వారికి నాలుగు నెలల జీతాలు చెల్లించక పోతే సీఐటీయూ ప్రత్యక్ష ఆందోళన చేస్తుందని హెచ్చరించారు.

Updated Date - 2021-10-30T04:47:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising