ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారం మోసేదెలా!

ABN, First Publish Date - 2021-10-22T04:34:52+05:30

అసలే ఆదాయం లేక సతమతమవుతున్న పంచాయతీలపై కొత్తగా సచివాలయాల నిర్వహణ భారం పడడంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో కొత్త పాలక వర్గాలు ఉన్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పంచాయతీలపై సచివాలయాల నిర్వహణ వ్యయం

సచివాలయాలకు జమ కాని సేవా రుసుం నిధులు

కొత్త పాలకవర్గాలకు తలనొప్పిగా మారిన వైనం

ఏలూరు రూరల్‌, అక్టోబరు 21: అసలే ఆదాయం లేక సతమతమవుతున్న పంచాయతీలపై కొత్తగా సచివాలయాల నిర్వహణ భారం పడడంతో ఏం చేయాలో తెలియని సందిగ్ధంలో కొత్త పాలక వర్గాలు ఉన్నాయి. ఒక్కో సచివాల యానికి స్టేషనరీ, కంప్యూటర్‌, ప్రింటర్‌లు, బయోమెట్రిక్‌ యంత్రాల నిర్వహణ, నెట్‌ ఛార్జీలు, కరెంటు బిల్లులకు నెలకు సగటున రూ.ఐదువేల నుంచి రూ.పది వేల వరకూ ఖర్చు అవుతోంది. ఏలూరు మండలంలో 22 పంచాయతీలు ఉం డగా వీటి పరిధిలో 46 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల నిర్వ హణకు అధిక వ్యయం అవుతోంది. ఈ భారం పూర్తిగా గ్రామ పంచాయతీల పైనే పడుతోంది. ఇప్పటికే అరకొర నిధులతో పంచాయతీలు అవస్థలు పడు తుండగా ఈ అదనపు భారం వల్ల పాలన గాడి తప్పుతోందని అధికారులు చెబుతున్నారు. సచివాలయ సేవలు ద్వారా వచ్చే ఆదాయం ఏమాత్రం సరి పోవడం లేదని పంచాయతీలకు అదనపు నిధులు మంజూరు చేయకపోతే వాటి నిర్వహణ మరింత ఇబ్బందిగా మారుతుందని అధికారులు చెబుతు న్నారు. 

 సేవా రుసుం వస్తున్నా..

సచివాలయాల ద్వారా 545 రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నారు. ఒక్కో సేవకు ఒక్కో విధంగా రుసుము వసూలు చేస్తున్నారు. ఇలా వసూలు చేసిన వాటిని ప్రభుత్వానికి జమ చేస్తున్నారు. కానీ తిరిగి నిఽధులు సచివాల యాలకు కేటాయించడం లేదు. సచివాలయాల ద్వారా వచ్చే ఆదాయం విని యోగించలేక, వాటి నిర్వహణ భారం మోయలేక పంచాయతీలు ఆర్థికంగా సతమతమవుతున్నాయి. దీంతో కొత్తగా బాధ్యతలు చేపట్టిన సర్పంచ్‌లకు సచివాలయ నిర్వహణ తలనొప్పిగా మారింది.  ప్రభుత్వం అదనంగా నిధులు మంజూరు చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదని వ్యాఖ్యానిస్తున్నారు. 

Updated Date - 2021-10-22T04:34:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising