ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమ్మో.. జ్వరం

ABN, First Publish Date - 2021-10-18T04:50:36+05:30

నిన్నటి వరకూ కరోనాతో భయపడిన జనం ఇప్పుడు ఎలాంటి జ్వరం వచ్చినా వణికిపోతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గ్రామాల్లో డెంగీ విజృంభణ.. మలేరియా, టైఫాయిడ్‌తో విలవిల 

ప్రైవేటు ఆస్పత్రుల బాదుడు.. ఆందోళనలో ప్రజలు 

ఏలూరు రూరల్‌, అక్టోబరు 17 : నిన్నటి వరకూ కరోనాతో భయపడిన జనం ఇప్పుడు ఎలాంటి జ్వరం వచ్చినా వణికిపోతున్నారు. ప్రస్తుతం డెంగీ, టైఫా యిడ్‌, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరం బారిన పడిన ఒకటి రెండు రోజుల్లో రక్తంలో కణాలు తగ్గిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతు న్నారు. తొలుత స్థానిక ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. తర్వాత ప్రభుత్వాస్పత్రికి వెళ్తున్నారు. ముఖ్యంగా పేద, మధ్య తరగతి ప్రజలు ఆర్థికంగా కుదేలవుతున్నారు. గతంలో కరోనా బారిన పడిన వారికి సైతం జ్వరాలు వస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. గతేడాదిగా వైద్య ఆరోగ్య శాఖ నిర్ధారణ పరీక్షలు, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించింది. యాప్‌ల్లో వివరాలు నమోదుతో బీజీగా ఉన్నారు. ఉన్నతాధికారుల లక్ష్యాలు, ఆదే శాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈనేపథ్యంలో వర్షాకాలంలో గ్రామాల్లో చేయాల్సిన ఫీవర్‌ సర్వేలను మొక్కుబడి తంతుగా ముగించారు. ఆ ప్రభావం జ్వరాల గుర్తింపుపై పడుతోంది. దీనికి తోడు గ్రామాల్లో పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉంది. చెత్త, వ్యర్థాలను ఇష్టారాజ్యంగా పారబోస్తున్నారు. ఖాళీ ప్లాస్టిక్‌ సీసాలు, కొబ్బరి బొండాలు ఎక్కడపడితే అక్కడ వేయడంతో దోమలకు ఆవాసంగా మారుతున్నాయి. పంచాయతీల్లో పారిశుధ్య పనులు అంతంత మాత్రంగా జరుగుతు న్నాయి. యంత్రాలు, పరికరాలు, మూలకు చేరాయి. ఫాగింగ్‌ చేస్తున్న దాఖలాలు లేవు. ఇటీవల రూరల్‌ మండలం శనివారపుపేటలో ఐదు డెంగీ కేసులు నమోదు కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పారి శుధ్యంపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.   

Updated Date - 2021-10-18T04:50:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising