ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తాడేపల్లిగూడెం లిక్కర్ షాపుల అద్దెల్లో భారీగా గోల్ మాల్: టీడీపీ నేత

ABN, First Publish Date - 2021-06-20T18:56:35+05:30

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిడూడెంలో లిక్కర్ షాపుల అద్దెల్లో ఎక్సైజ్ అధికారులు భారీగా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిడూడెంలో లిక్కర్ షాపుల అద్దెల్లో ఎక్సైజ్ అధికారులు భారీగా గోల్‌మాల్ చేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నారని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వలవల మల్లిఖార్జున రావు(బాబ్జి) తెలిపారు. చదరపు గజానికి రూ.175 చొప్పున (రూ.1,40,000) ప్రభుత్వం నుండి  అద్దె రూపంలో తీసుకొని షాప్ యజమానికి చదరపు గజానికి రూ.40(కేవలం రూ.32,000)ల చొప్పున ఇస్తూ సుమారు రూ.1,08,000 అధికారుల జేబుల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు. ఈ వసూళ్లలో జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు హస్తం ఉందని, దీనిమీద సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం గత మున్సిపాల్టీ కౌన్సిల్‌లో మున్సిపల్ భవనాల్లో లిక్కర్ షాప్ నిర్వహణకు అద్దెకు ఇవ్వకూడదన్న తీర్మానాన్ని బేఖాతరు చేశారన్నారు. అధిక అద్దెలతో లిక్కర్ షాపులను నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. తాడేపల్లిగూడెంలోని బ్రాందీషాప్‌లోనే కాకుండా రాష్ట్రంలో అన్ని షాపుల అద్దెల పరిస్థితి అలానే ఉందా అని మల్లిఖార్జునరావు ప్రశ్నించారు.


Updated Date - 2021-06-20T18:56:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising