ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏలూరు కాలువపై అడ్డుకట్ట

ABN, First Publish Date - 2021-04-21T05:29:27+05:30

తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు వేసవి దాహార్తి తీర్చేందుకు మున్సి పాలిటీ చర్యలు చేపట్టింది.

ఏలూరు కాల్వపై ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాగునీటి కోసం రూ. 4 లక్షలు వ్యయం 

15 రోజులపాటు కాలువనీటి వినియోగం 

 (తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి) : తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు వేసవి దాహార్తి తీర్చేందుకు మున్సి పాలిటీ చర్యలు చేపట్టింది. కాలువల్లో నీటి సరఫరా నిలిపివేయడంతో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకునేలా ఏలూరు కాలువల్లో అడ్డుకట్ట వేశారు. అందుకోసం రూ. 4 లక్షలు వెచ్చించారు. దాదాపు 15 రోజులపాటు అదే నీటిని వినియో గించనున్నారు. ఆ తర్వాత పంపులు చెరువు నుంచి మంచి నీటిని సరఫరా చేస్తారు. ప్రస్తుతం ప్రతిరోజు 1.40 కోట్ల లీటర్ల మంచి నీటిని అందజేస్తు న్నారు. వేసవిలో పూర్తిస్థాయిలో మంచినీరు అందిం చాలంటే పంపులు చెరువు సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో ప్రతి ఏటా ఏలూరు కాలు వలో అడ్డుకట్ట వేసి రెండు వారాల పాటు నెట్టుకొస్తున్నారు. అనంతరం పంపుల చెరువునీటిని వినియోగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద గోదావరి ప్రవాహాన్ని నిలిపివేసి పనులు చేపడుతున్నారు. దాంతో జూన్‌ 30 వరకు నీటి సరఫరా నిలిపి వేయాలని అధికారులు నిర్ణయిం చారు. అంటే 70 రోజులపాటు పట్టణ ప్రజలకు పంపుల చెరువునుంచి మంచి నీటిని అందించాలి. గతంలో 45 రోజుల వ్యవధిలో కాలువలకు నీరు విడుదల చేస్తేనే మంచినీటికి కటకట లాడేవారు. ఇవన్నీ దృష్టిలో ఉంచు కుని ఏలూరు కాలువలో నీటిని 15 రోజులపాటు వినియోగించు కోవాలని భావిస్తున్నారు. ఆ తర్వాత పంపుల చెరువునీటిని సక్రమంగా వినియోగిస్తే మరో 30 రోజులు పాటు అందజేసేందుకు వీలుంటుంది. ప్రత్యామ్నా యంగా భూగర్భజలాలు ఉపయోగిస్తే తప్పా వేసవిలో మంచినీరు అందించే అవకాశం లేదు. గతంలో గ్రామీణ ప్రాంతంలో ఉన్న బోరు బావుల నుంచి ట్యాంకర్‌ల ద్వారా నీటిని రప్పించి సరఫరా చేశారు. ఇప్పుడు కూడా అటువంటి ఏర్పాట్లు చేయాలి. భూగర్భ జలాల పంపిణీ కోసం ఇప్పటినుంచే పట్టణంలో బోరుబావులను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఈ ఏడాది గండం గట్టెక్కే అవకాశం ఉంటుంది. 


మంచినీటి ఇబ్బంది లేకుండా చూస్తాం :  వెంకట్రావు, ఎంఈ

పట్టణంలో మంచినీటి సరఫరాకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసు కుంటున్నాం, వేసవిలో ఇబ్బంది రానివ్వం. అందుకు తగ్గ ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం. ఎన్ని నిధులైనా కేటాయించి పట్టణ ప్రజలకు మంచినీరు అందజేస్తాం.  


Updated Date - 2021-04-21T05:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising