ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇక ఇంటి వద్దకే రేషన్‌

ABN, First Publish Date - 2021-01-22T05:40:31+05:30

వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్‌ సరుకులను సరఫరా కానుంది.

ఏలూరు చేరుకున్న రేషన్‌ పంపిణీ వాహనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మండలాలకు 784 రేషన్‌ వాహనాలు

ఫిబ్రవరి 1 నుంచి 18 వరకు సరఫరా

ఏలూరు సిటీ, జనవరి 21 : వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్‌ సరుకులను సరఫరా కానుంది. దీనికోసం  ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలను గురువారం ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి విజయవాడలో ప్రారంభించ డంతో ఇవన్నీ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రమైన ఏలూ రు తీసుకువచ్చిన వాహనాలను కోటదిబ్బ జూనియర్‌ కళా శాలలో ఉంచి కేటాయించిన మండలాలకు పంపిస్తున్నారు. జిల్లాలో 2,200 చౌక డిపోలుండగా, రేషన్‌ కార్డులకు అనుగు ణంగా వాహనాలను కేటాయించారు. గ్రామ/వార్డు వలంటీర్‌ వ్యవస్థను పౌరసరఫరాల శాఖతో అనుసంధానం చేసి ప్రతి నెలా ఒకటి నుంచి 18వ తేదీ వరకు ఇంటింటికీ  బియ్యం, కందిపప్పు, పంచదార, గోధుమలు  వంటి నిత్యావసర సరుకు లను అందించనున్నారు. జిల్లాలో 12.29 లక్షల రేషన్‌ కార్డులు న్నాయి. జిల్లాకు 784 వాహనాలను కేటాయించటంతో వీటిని మండలాలకు తరలించినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి ఎన్‌.సుబ్బరాజు తెలిపారు. ఈ వాహనాలకు ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేశారు. సబ్సిడీతో కూడిన వాహనా లను అందజేసి వారికి రేషన్‌ పంపిణీపై శిక్షణ ఇస్తున్నారు. జిల్లాకు వచ్చిన వాహనాలు ఉన్నతాధికారులు పరిశీలించారు. రేషన్‌ వాహనాల్లో తూకపు మిషన్‌, మైకు, చార్జింగ్‌ మిషన్‌, ఈ పాస్‌ యంత్రం కల్పించారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా రేషన్‌ షాపులకు సరుకులను తరలిస్తారు. చౌక డిపోల నుంచి రేషన్‌ పంపిణీ చేసే వాహనదారుడు సరుకులను బయో మెట్రిక్‌ వేసి తీసుకు వెళతారు. రోజుకు 90 కుటుంబాలకు ఈ రేషన్‌ పంపిణీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కొక్క వాహనానికి సంబంధించి 1600 కార్డుదారులకు రేషన్‌ అందించటానికి ఏర్పాట్లు చేస్తున్నారు.  


Updated Date - 2021-01-22T05:40:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising