ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వింత వ్యాధిని గుర్తించడంలో ప్రభుత్వం విఫలం

ABN, First Publish Date - 2021-01-21T04:11:42+05:30

వింత వ్యాధికి కారణాలు తెలుసు కోవ డంలో ప్రభుత్వం విఫలమైందని తాడేపల్లి గూడెం జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ విమర్శిం చారు.

బాధితులను పరామర్శించి పండ్లు అందజేస్తున్న శరణాల మాలతీరాణి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌

భీమడోలు,జనవరి 20 : వింత వ్యాధికి కారణాలు తెలుసు కోవ డంలో ప్రభుత్వం విఫలమైందని తాడేపల్లి గూడెం జనసేన ఇన్‌ఛార్జి బొలిశెట్టి శ్రీనివాస్‌ విమర్శిం చారు.పూళ్ళ పీహెచ్‌ సీలో వింత వ్యాధి సోకి కోలుకుంటున్న బాధి తులను బుధవారం జనసేన, బీజేపీ నాయకులు పరామర్శించారు. శాస్త్ర పరిజ్ఞానం పెరిగినప్పటికీ వ్యాధికి గల కార ణాలు తెలుసుకోలేకపోవడం దారుణమన్నారు. పరిసర గ్రామాలకు ఈ వ్యాధి సోక కుండా పభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జనసేన దెందులూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఘంటసాల వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఏలూరు, పూళ్ళలో వింతవ్యాధి సోకి ప్రజలు అనారోగ్యం పాలైనప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుం ద న్నారు.గ్రామాల్లో తాగునీటిని శుద్ధి చేయడంలో అధికారులు విఫలమవుతున్నారని బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి విమర్శించారు. పీహెచ్‌సీలో బాధితులను ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు పరామర్శించారు. వ్యాధి తీవ్రత కొంతమేర తగ్గిందని ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పూళ్ళలో సూపర్‌శానిటేషన్‌ పనులు విధిగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. 


Updated Date - 2021-01-21T04:11:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising