ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అప్పు తీర్చమని నిరసన

ABN, First Publish Date - 2021-03-01T05:15:41+05:30

అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తున్న కుటుంబం ఇంటి ముందు బాధితులు ఆదివారం నిరసన దీక్షకు దిగారు.

అప్పు తీసుకున్న వారి ఇంటి ఎదుట దీక్షకు దిగిన బాధితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

42 మంది నుంచి రూ. కోటి పైగానే వసూలు

లబోదిబోమంటున్న బాధితులు 

అత్తిలి, ఫిబ్రవరి 28 : అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తున్న కుటుంబం ఇంటి ముందు బాధితులు ఆదివారం నిరసన దీక్షకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం. అత్తిలి మండలం ఆరవల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ గ్రామంలో పలువురు వద్ద నుంచి వడ్డీకి డబ్బులు తీసుకుంది. అప్పు ఇచ్చినవారు ఇటీవల  ఆమె ఇంటికి వెళ్లి బాకీ తీర్చమని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో పాటు తమపై కుక్కను వదులుతున్నారని వాపోతున్నారు. 4 నెలలుగా తిరుగుతున్నా సమాధానం రాకపోవడంతో పెద్దల దృష్టికి తీసుకెళ్లామని వారికి సమాధానం చెప్పకపోవడంతో నిరసనదీక్షకు దిగామన్నారు. సుమారు 42 మంది నుంచి కోటి రూపాయలు పైబడి వడ్డీకి డబ్బులు తీసుకుందని చెబుతున్నారు. రూ.70 వేలు అ ప్పుగా ఇచ్చా.. ఇప్పుడు అడిగితే  కోర్టులో తేల్చుకుందామని సమాధానం చెబుతోందని కోనాల నాగరత్నం వాపోయింది. నా వద్ద లక్షా 80 వేలు తీసుకుందని.. అడిగితే రేపూ మాపూ అంటోందని బాధితురాలు కర్రి ఉమా మహేశ్వరి ఆవేదన వ్యక్తం చేసింది. నావద్ద రూ. 50 వేలు తీసుకుందని అడిగితే కోర్టులో తేల్చుకుందామని చెబుతోందని గుడిమెట్ల సత్యనారాయణరెడ్డి చెబుతున్నారు. దీనిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. 

Updated Date - 2021-03-01T05:15:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising