ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల్లో గోపూజలు

ABN, First Publish Date - 2021-01-16T05:47:38+05:30

కనుమ పండుగ రోజు పట్టణంలోని క్షీరా రామలింగేశ్వరస్వామి, అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో గో పూజలు వైభవంగా నిర్వహించారు.

పాలకొల్లు లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో గోపూజ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాలకొల్లు అర్బన్‌, జనవరి 15 : కనుమ పండుగ రోజు పట్టణంలోని క్షీరా రామలింగేశ్వరస్వామి, అష్టభుజ లక్ష్మీనారాయణస్వామి ఆలయంలో గో పూజలు వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు మల్లికార్జున శర్మ, కిట్టప్ప, పూర్ణయ్య, అనిల్‌, అభిషేక పండితులు భమిడిపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, భక్తులు పాల్గొన్నారు.


భీమవరం టౌన్‌ : మావుళ్లమ్మ ఆలయం వద్ద గోపూజ నిర్వహించి గోపూజ గొప్పతనంపై ప్రవచనం చేశారు. గునుపూడి సోమేశ్వరస్వామి, భీమేశ్వరస్వామి, రామలింగేశ్వరస్వామి ఆలయాల్లో గోపూజ నిర్వహించారు. ఆలయ ఈవో అరుణ్‌ కుమార్‌, తోట శ్రీనివాసరావు, డీవీ.కృష్ణంరాజు ఆధ్వర్యంలో గోపూజలు నిర్వహించారు.  


కాళ్ళ : కాళ్ళకూరు వేంకటేశ్వరస్వామి ఆలయంలో కనుమ పండుగ పర్వదినం పురస్కరించుకొని శుక్రవారం గోపూజ నిర్వహించారు. అనంతరం విద్యార్ధులకు క్విజ్‌ నిర్వహించారు. భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు. ఆలయ ఈవో ముదునూరి సూర్యనారాయణరాజు, సిబ్బంది ఏర్పాటు చేశారు. 

ఫ ఉండి : ఉండిలోని ఆలయంలో గోమాతకు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో గుండాబత్తుల సుబ్బారావు, శేషాద్రి శ్రీనివాసరావు, విద్యా సాగర్‌, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఎన్‌ఆర్‌పిఅగ్రహారంలోని విశ్వేశ్వరస్వామి ఆలయంలో గోమాత పూజలను నిర్వహించారు. 


పెనుగొండ: వాసవి శాంతి క్షేత్రంలో గోపూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వాసవి హోమం, మరకత వాసవి మూర్తికి విశేష అలంకరణ చేశారు. చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని  తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - 2021-01-16T05:47:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising