బల్లిపాడులో మదనగోపాలుడి రథోత్సవం
ABN, First Publish Date - 2021-03-25T05:13:05+05:30
బల్లిపాడులో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాలస్వామి రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా సాగింది.
అత్తిలి, మార్చి 24 : బల్లిపాడులో శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత మదన గోపాలస్వామి రథోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా సాగింది. ఉద యం నుంచి జరిగిన తీర్థ మహోత్సవానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై స్వామిని దర్శించుకున్నారు. అరటి గెలలు స్వామికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేలాది మంది భక్తులకు అఖండ అన్నసమారాధన చేశారు.అనంతరం రథోత్సవం నిర్వహించారు. రఽథానికి వేద పండితులు సం ప్రోక్షణ చేసి మేళతాళాలు నడుమ స్వామి, అమ్మవార్లను ఆలయం నుంచి పల్లకిపైకి తీసుకువచ్చి రథంపై ఉంచారు. రథాన్ని లాగడానికి పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్థులు హాజరయ్యారు. భక్తులు స్వామికి అరటి గె లలు సమర్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. విద్యుద్దీపాలతో ఏర్పాటు చేసిన దేవతామూర్తుల సెట్టిం గ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మాజీ సర్పంచ్ ఆకుల పండుస్వామి, ధనుమూరి తాతాజీ తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Updated Date - 2021-03-25T05:13:05+05:30 IST