ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

eluruలో టీడీపీ ర్యాలీకి పోలీసుల అడ్డంకులు

ABN, First Publish Date - 2021-12-15T16:58:52+05:30

అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లాలో అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: అమరావతి రైతులకు మద్దతుగా టీడీపీ చేపట్టిన న్యాయస్థానం టు దేవస్థానం కార్యక్రమానికి పశ్చిమగోదావరి జిల్లాలో అడుగడుగునా పోలీసులు అడ్డంకులు సృష్టించారు. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల టీడీపీ నాయకులను పోలీసులు నిర్బంధించారు. అలాగే తెలుగుదేశం కార్యకర్తల ర్యాలీలను అడ్డుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ టీడీపీ అధ్యక్షులు సాయి సత్యనారాయణను నిర్బంధించగా.. మరోవైపు జంగారెడ్డిగూడెం మద్ది ఆలయం దగ్గర టీడీపీ శ్రేణుల బైక్ ర్యాలీని నిలిపివేశారు. బైక్ ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉంటే చింతలపూడిలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బైక్ ర్యాలీగా వెళ్తున్న టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని ర్యాలీని ఆపివేశారు. మరోవైపు తీవ్ర ఆటంకాల మధ్య మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత జవహర్, ఏలూరు పార్లమెంట్ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ఏలూరు చేరుకున్నారు.


ఇదిలా ఉంటే న్యాయస్థానం టూ దేవస్థానం వరకు అమరావతి రైతులు చేపట్టిన మహా పాదయాత్ర దిగ్విజయంగా ముగిసింది. బుధవారం అమరావతి రైతులంతా తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 45 రోజులపాటు నిర్విరామంగా పాదయాత్ర కొనసాగింది. 

Updated Date - 2021-12-15T16:58:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising