ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పందేలకు సై

ABN, First Publish Date - 2021-01-12T05:23:02+05:30

సంక్రాంతి సంప్రదాయ ముసుగులో కోడిపం దేలు, జూదాల జాతరకు రంగం సిద్ధమైం ది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోడి పందేల నిర్వహణకు సన్నాహాలు 

ఏలూరు కల్చరల్‌, జనవరి 11 : సంక్రాంతి  సంప్రదాయ ముసుగులో కోడిపం దేలు, జూదాల జాతరకు రంగం సిద్ధమైం ది. ఈనెల 13న భోగి పండుగ నాడు పందేలకు తెరలేపనుంది. సంక్రాంతి మూడు రోజులు  పందేలు నిర్వహించేం దుకు రహస్యంగా నిర్వాహకులు బరులు సిద్ధం చేస్తున్నారు. దీనికి కొందరు ప్రజా ప్రతినిధుల అండ ఉన్నట్టు గుసగుసలు విన్పిస్తున్నాయి. ప్రతి ఏడాది మాదిరిగానే మండలంలోని వివిధ గ్రామాల్లో పందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదల య్యాయి.  మైదానాలను, బరులుగా సిద్ధం చేస్తున్నారు. బరులు, పందెం శిబిరా ల వద్ద గుండాట, పేకాట, మద్యం బెల్టు షాపులు, ఫాస్ట్‌ఫుడ్‌ ఏర్పాట్లు చేసేందుకు పాటలు నిర్వహిం చినట్టు తెలిసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ పందేలకు అనుమతులు వస్తాయన్న ఆలోచనతో బయటకు తెలియకుండా నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కోడిపందేలు నిర్వహిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటా మనే హెచ్చరికలతో పాటు బరులు ఏర్పాటు చేయకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నా పందెం రాయుళ్ళు వెనుకంజ వేయడంలేదు. మండలం    

  లోని కొమడవోలు, జాలిపూడి, పోణంగి, గుడివాకలంక. పైడిచింతపాడు, చొదిమెళ్ళ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు సాగుతున్నాయి. 


పుంజుల కోసం జల్లెడ 

పందెం కోసం కోడిపుంజులు అమ్మడం గ్రామాల్లో ముమ్మరంగా సాగు తోంది. ఒకొక్క పందెం కోడికి రంగును బట్టి రూ. 5 వేల నుంచి రూ.30 వేల వరకూ విక్రయిస్తున్నారు. గడిచిన వారం రోజులుగా కిలోన్న ర బరు వు దాటిన పుంజుల వివిధ జాతుల వాటిని ఒక్కోటికగా బేరాలు ఆడుతూ కొనుగోలు చేస్తున్నారు. కాకి, పచ్చకాకి, సీతువా, పూలా, మైలా, డేగ, నెమలి, తెల్ల నెమలి, ఎర్ర అబ్రాస్‌, నల్లబొట్ల సీతువ, రసంగి, ఇతర జాతుల పుంజులను కొనుగోలు చేస్తున్నారు. వీటిలో పుంజులను బట్టి కొనుగోలు చేస్తున్నారు. 


క ఠిన చర్యలు తప్పవు : తహసీల్దార్‌

కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని  తహసీల్దార్‌ బి.సోమశేఖర్‌ హెచ్చరించారు. ఇప్పటికే గ్రామాల్లో కోడిపందేలను అడ్డుకునేలా అవగాహన సదస్సులు నిర్వహించినట్టు తెలిపారు. చట్టవిరు ద్ధంగా ఎవరు ప్రవర్తించినా చర్యలు తప్పవన్నారు. కోడి పందేల నివారణకు గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.  

Updated Date - 2021-01-12T05:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising