ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పక్క జిల్లాకు నీరు తరలిస్తున్నారు

ABN, First Publish Date - 2021-03-05T05:29:35+05:30

దాళ్వాకు సాగు నీటి ఎద్దడితో రైతులు సతమతమవుతుంటే పాతవయ్యేరు కాలువ లాకులు, అయిభీమవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువ నుంచి పంపు హౌస్‌ల ద్వారా నీటిని కృష్ణాజిల్లాకు రాత్రిపూట తోడేస్తున్నారు.

కృష్ణాజిల్లాకు నీటిని లిఫ్ట్‌ చేస్తున్న కళింగపాలెం లాకుల వద్ద పంపు హౌస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆకివీడు మండలంలో సాగు నీటి ఎద్దడి


కళింగపాలెం (ఆకివీడు రూరల్‌), మార్చి 4: దాళ్వాకు సాగు నీటి ఎద్దడితో రైతులు సతమతమవుతుంటే పాతవయ్యేరు కాలువ లాకులు, అయిభీమవరంలోని వెంకయ్య వయ్యేరు కాలువ నుంచి పంపు హౌస్‌ల ద్వారా నీటిని కృష్ణాజిల్లాకు రాత్రిపూట తోడేస్తున్నారు. ఉన్నతాధికారులు అనుమతులున్నాయని, స్థానిక రైతులను బెదిరిస్తున్నారని వాపోతున్నారు. కాలువ శివారు  ప్రాంతాలు కావడంతో నీటికోసం తీవ్ర ఇబ్బందులు పడు తున్న తరుణంలో పంపు హౌస్‌లు ద్వారా దర్జాగా నీటిని లిఫ్ట్‌ చేస్తున్నారని, పంచాయతీలు అనుమతులు లేవని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులను ఇబ్బందులకు గురి చెయ్యవద్దని, పంపు హౌస్‌లు ద్వారా నీటిని తోడడం ఆపివేయాలని పలువురు కోరుతున్నారు.


రైతులు సాగునీటిని వినియోగించుకోండి : డీఈ


ఉండి: పంట కాలువకు వంతులో సాగునీరు వస్తుందని శివారు ప్రాంతాల రైతులు వినియోగించుకోవాలని సబ్‌ డివిజన్‌ ఇరిగేషన్‌ డీఈ వెంకటేశ్వరరావు కోరారు. గురువారం ఉండి పంట కాలువ నీటి మట్టం ఆయన పరిశీలించారు. చెరుకువాడ, అర్తమూరు ప్రాంతాల రైతులు నీటిని ఉపయో గించుకోవాలన్నారు. యండగండి, గరగపర్రు, మహదేవపట్నం, ఎన్‌ఆర్‌పి అగ్రహారం, ఉండి, కలిసిపూడి, చెరుకువాడ ప్రాంతాలకు చెందిన రైతులు ఎప్పటికపుడు వరిచేలను చూసుకోవాలన్నారు.

Updated Date - 2021-03-05T05:29:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising