ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొంగిన వాగులు

ABN, First Publish Date - 2021-07-23T04:53:49+05:30

భారీ వర్షాలతో ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి.

జంగారెడ్డిగూడెం మండలం పట్టెన్నపాలెం వద్ద జల్లేరు వాగు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిండుతున్న జలాశయాలు



జంగారెడ్డిగూడెం / కుక్కునూరు / బుట్టాయగూడెం

భారీ వర్షాలతో ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో వాగులు పొంగుతున్నాయి. జల్లేరు, ఎర్ర కాల్వ జలాశయాలు జల కళ సంతరించుకున్నాయి. జల్లేరు  వాగు పట్టెన్నపాలెం వద్ద గురువారం ఉదయం ఉధృతంగా ప్రవహించింది. వాహన రాకపోకలు నిలిచిపోయాయి.


కుక్కునూరు మండలంలో గుండేటి వాగుకు భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఎగువన తెలంగాణ ప్రాంతంలో కురిసిన వర్షాలకు మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహి స్తున్నాయి. చెరువులు, కుంటలు కూడా నీటితో నిండాయి. గుండేటి వాగు, పాలవాగు, వెంకటాపురం వాగులు వరద నీటితో పోటెత్తాయి. చింతలపూడి సమీపంలోని నాగిరెడ్డిగూడెం వద్ద తమ్మిలేరు రిజర్వాయర్‌లో ఎగువ నుంచి వరద నీరు చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరపి లేని వర్షం పడడంతో తమ్మిలేరు ఎగువ పరివాహక ప్రాంతంలో చేరిన నీరు వరదగా ప్రాజెక్టులోకి చేరుతోంది. గురువారం సాయంత్రం 5 గంటలకు గంటకు ఆరు వేల క్యూసెక్కుల నీరు చేరిందని ప్రాజెక్టు డీఈ అప్పారావు తెలిపారు. ప్రస్తుతం తమ్మిలేరు రిజర్వాయర్‌ నీటి మట్టం 337 అడుగులు ఉందన్నారు. చెరువుల్లో కూడా వర్షం నీరు చేరింది. 


బుట్టాయగూడెం మండలం గుబ్బల మంగమ్మ దొరమామిడి జల్లేరు జలాశయంలో వరదనీరు చేరుతోంది. బుధ వారం 25 క్యూసెక్కులు ఉన్న ఇన్‌ఫ్లో గురువారం 238 క్యూసెక్కులకు పెరి గింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 7 గంటలకు వరకు జలాశయం వద్ద 89 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఇరిగేషన్‌ ఏఈ కిరణ్‌ తెలిపారు. వర్షాలు మరింత ఎక్కువగా కురిస్తే ఇన్‌ప్లో పెరగడమే కాకుండా జలాశయంలోకి అధికంగా వర్షపునీరు చేరుతుందని తెలిపారు.

Updated Date - 2021-07-23T04:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising