ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘పరిహారం అందే వరకు గ్రామాలు ఖాళీ చేయం’

ABN, First Publish Date - 2021-03-05T05:24:11+05:30

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారాలు అందించేంత వరకు గ్రామాలను ఖాళీ చేసేది లేదని ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల సాధన సమితి అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, మార్చి 4: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారాలు అందించేంత వరకు గ్రామాలను ఖాళీ చేసేది లేదని ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల సాధన సమితి అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి అన్నారు. కొండ్రూకోటలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుం డా రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా గ్రామ సభలు నిర్వహించారన్నారు.  18 ఏళ్లు నిండిన యువతి, యువకులకు గ్రామాలు ఖాళీ చేసే నాటికి ప్యాకేజీ ఇవ్వాలని, పెళ్లైన యువతలకు కూడా ప్యాకేజీలు చెల్లించాలని భూముల సమస్యలు పరిష్కరించాలని రూ.10లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల అభీష్టం మేరకు సమస్యలు పరిష్కరించి తరలించాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులకు సమస్యలను తెలియజేస్తూ లేఖలు పంపించామన్నారు. మాడే రాజు, కట్‌రాజుల సతీశ్‌, నర్సారపు రాజేశ్‌, గనిశెట్టి సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T05:24:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising