ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాదేవ శివలింగానికి మహాకుంభాభిషేకం

ABN, First Publish Date - 2021-03-09T06:51:55+05:30

వీరంపాలెం బాలాత్రిపుర సుందరీ పంచాయతన క్షేత్రం ఆలయ ప్రాంగణంలో వున్న 24 అడుగుల మహాదేవ శివలింగానికి శివరాత్రి పురస్కరించుకుని మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు.

స్పటిక లింగం కొలువైన లక్ష శివలింగ మహాగిరి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

12 నదీ జలాలతో స్పటిక లింగానికి ప్రత్యేక అభిషేకాలు 

వీరంపాలెంలో మహాశివరాత్రి ఏర్పాట్లు 

తాడేపల్లిగూడెం రూరల్‌, మార్చి 8: వీరంపాలెం బాలాత్రిపుర సుందరీ పంచాయతన క్షేత్రం ఆలయ ప్రాంగణంలో వున్న 24 అడుగుల మహాదేవ శివలింగానికి శివరాత్రి పురస్కరించుకుని మహాకుంభాభిషేకం నిర్వహిస్తామని ఆలయ వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ సిద్ధాంతి తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మాట్లాడుతూ  మహా శివరాత్రికి ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, ఈనెల 10 నుంచి 12 వరకూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. 10న ఉదయం 9.09 గంటలకు కలశ స్థాపనతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయ న్నారు. 11న శివరాత్రి సందర్భంగా 12 విశేష నదీ జలాలతో స్పటిక లింగానికి ప్రత్యేక అభిషేకాలు, మహాదేవ శివలింగానికి మహాకుంభాభి షేకంతో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక వేత్తల ప్రవచనాలు, భగవన్‌నామ సంకీర్తనలు ఏర్పాటు చేశామన్నారు. 12న శివపార్వతులకు శాంతి కల్యాణంతో వేడుకలు ముగుస్తాయన్నారు. భక్తులకు అసౌకర్యం లేకుండా వలంటీర్ల ద్వారా ప్రత్యేక సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు.

Updated Date - 2021-03-09T06:51:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising