ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాక్సిన్‌కు అధికార పార్టీ రికమెండేషన్‌?

ABN, First Publish Date - 2021-05-07T05:48:33+05:30

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్ల కోసం అధికార పార్టీ నాయకులు రికమెండేషన్లు వైద్యాధికారులకు తలనొప్పిగా మారాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోపాలపురం, మే 6: కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణ నేపథ్యంలో కొవిడ్‌ వ్యాక్సిన్ల కోసం అధికార పార్టీ నాయకులు రికమెండేషన్లు వైద్యాధికారులకు తలనొప్పిగా మారాయి. ఒక పక్క కరోనా కారణంగా ప్రజలు బిక్కు బిక్కుమంటూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని గడుపుతుంటే మరో పక్క ప్రభుత్వం అందిస్తున్న అరకొర వ్యాక్సిన్ల కోసం ప్రజలు బారులు తీరుతున్నా రు. దీంతో వ్యాక్సినేషన్‌ సెంటర్ల వద్ద 45 ఏళ్ల వయసు పైబడిన వారు వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు గుంపులు గుంపులుగా చేరుతున్నారు. అధికార పార్టీకి చెందిన గ్రామస్థాయి నాయకులు మొదలుకుని ఎమ్మెల్యే స్థాయి వరకు తమ బంధువులకు వ్యాక్సిన్లు వేయాలంటూ వైద్యాధికారులకు ఫోన్‌ ద్వారా రికమెండేషన్లతో సతాయిస్తున్నారు. వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారికి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియ చేపట్టి వ్యాక్సిన్‌ వేయాలో, అధికార పార్టీ నుంచి వచ్చే ఫోన్లకు సమాధానం చెప్పాలో అర్థంకాక వైద్యులు తలలు పట్టుకుంటు న్నారు. అధికార పార్టీ నాయకుల అయినవారికి వ్యాక్సిన్లు వేయాలని సిఫార్సులు చేస్తుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓట్ల కోసం అర్ధించే నాయకులకు, ప్రజాప్రతినిధులకు వ్యాక్సినేషన్‌ విషయంలో సామాన్యులు గుర్తుకు రాకపోవడం గమనార్హం.


Updated Date - 2021-05-07T05:48:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising