ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాది ఉత్తమ పురస్కారాలు అందజేత

ABN, First Publish Date - 2021-04-14T05:22:08+05:30

ఉగాది ఉత్తమ పురస్కారాలకు పలువురు ఎంపికయ్యారు.

గుంటూరులో పురస్కారం అందుకుంటున్న మార్టేరు శాస్త్రవేత్త చింతా వెంకటరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెనుమంట్ర/ ఉండి/ కాళ్ళ/ ఆకివీడు, ఏప్రిల్‌ 13 : ఉగాది ఉత్తమ పురస్కారాలకు పలువురు ఎంపికయ్యారు. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనాస్ధానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ చింతా వెంకటరెడ్డి, ఉండి కృషివిజ్ఞానకేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డా. ఎన్‌. మల్లిఖార్జునరావు రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు ఇరువురికి గుంటూరులోని ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ విష్ణువర్థన్‌రెడ్డి పురస్కారాలను అందజేసి అభినందించారు. కాళ్ళ  పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న బొండాడ సువర్ణబాయి మంగళవారం ఉగాది విశిష్ట సేవా పురస్కారం అందుకున్నారు. కొవిడ్‌ 19 సమయంలో ఆమె చేసిన సేవలను గుర్తించి రుద్రరాజు ఆనందరాజు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో భీమ వరంలోని ఆనంద ఫంక్షన్‌ హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు సువర్ణబాయిని సన్మానించి, మెమెంటో, సర్టిఫికెట్‌ అందజేశారు.ఆకివీడు పార్వతీ సమేత వెంకట లింగేశ్వరస్వామి దేవస్థానం అర్చకుడు మోవ్వా సుబ్రహ్మణ్యశర్మను ఆర్‌ఆర్‌పేట వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఎండోమెంట్‌ డీసీ విజయరాజు ఘనంగా సన్మానించారు. 


49 మందికి ఉగాది పురస్కారాలు అందజేత

భీమవరంటౌన్‌ : శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను భీమే శ్వరస్వామి వారి దేవస్థానంలో శోభాయమానంగా నిర్వహించారు. అనంతరం విశిష్ట ఉగాది పురస్కారాన్ని డీఎన్‌ఆర్‌ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకట నరసింహరాజుకు అందజేశారు. తదుపరి 49 మందికి ఉగాది పుర స్కారాలను ఇచ్చారు. కార్యక్రమంలో మాజీఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, మాజీ చైర్మన్‌ కొటికలపూడి గోవిందరావు(చినబాబు), గాదిరాజు బాబు, గోకరాజు రామరాజు, ఛాంబర్‌ అద్యక్షుడు మానేపల్లి సూర్యనారాయణగుప్త, డాక్టర్‌ ఇర్రింకి సూర్యారావు,వేడుకల కమిటీ అధ్యక్షుడు కంతేటి వెంకట్రాజు, కన్వీనర్‌ చెరుకు వాడ రంగసాయి, వెంకట్రామయ్య,సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.  





Updated Date - 2021-04-14T05:22:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising