ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వద్దన్నా.. వెళ్లారు!

ABN, First Publish Date - 2021-03-08T06:23:38+05:30

పెద్దలు వద్దం టున్నా గోదావరిలో స్నానం చేద్దామని దిగిన నలు గురు విద్యార్థుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

గోదావరిలో మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోదారిలో స్నానానికి దిగి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

పెనుగొండ/తణుకు, మార్చి 7: పెద్దలు వద్దం టున్నా గోదావరిలో స్నానం చేద్దామని దిగిన నలు గురు విద్యార్థుల్లో ఇద్దరు మృత్యువాత పడ్డారు. తణుకులోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ సెకం డియర్‌ చదువుతున్న వీరు ఆదివారం కళాశాలకు వెళుతున్నామని ఇంటి వద్ద చెప్పి పెనుగొండ మం డలం సిద్ధాంతంలోని కేదార్‌ఘాట్‌ లంకపాయలో స్నానానికి దిగారు. నదీ లోతు ఎక్కువగా ఉంటుం దని స్థానిక రైతులు హెచ్చరించినప్పటికీ వీరు లెక్క చేయకుండా ముందుకువెళ్లారు. కాసేపటికే ఇద్దరు గల్లంతు కాగా, మిగిలిన ఇద్దరు తప్పించుకుని బయటపడ్డారు. పట్నాల మణికంఠ(17) మునిగి పోతుండగా బచ్చుల శివకళ్యాణ్‌(17) రక్షించే ప్రయ త్నం చేశాడు. గమనించిన రైతులు వీరిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ, కాసేపటికే వీరిద్దరి మృత దేహాలు బయటపడ్డాయి.మణికంఠ స్వగ్రామం ఉండ్రాజవరం అయినప్పటికీ వీరు పెరవలిలో ఉం టున్నారు. అతని తండ్రి శ్రీనివాస్‌ అన్నవరప్పాడు రైస్‌మిల్లులో పనిచేస్తున్నారు. మరో విద్యార్థి తణుకుకు చెందిన కల్యాణ్‌ తండ్రి టైలర్‌గా పనిచేస్తున్నా రు. మరో ఇరువురు విద్యార్థులు వల్లూరు చందు, కడలి సత్యనారాయణ సురక్షితంగా బయటపడ్డారు. కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరయ్యారు. చేతికంది వస్తారనుకున్న కుమారులు చనిపోవడంతో వారి కుటుంబ సభ్యుల ఆవేదనకు అంతులేకుండా పోయింది. పెనుగొండ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీయించారు. ఎస్‌ఐ పి.నాగరాజు ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


Updated Date - 2021-03-08T06:23:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising