ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏటిలోన చేపలంట..

ABN, First Publish Date - 2021-07-22T05:09:23+05:30

భారీ వర్షాలకు గోదావరి ఎర్రబడింది.. ఏటిలో చేప ఎగిరెగిరి పడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పోలవరం, జూలై 21: భారీ వర్షాలకు గోదావరి ఎర్రబడింది.. ఏటిలో చేప ఎగిరెగిరి పడుతోంది. ఉపనదులు, కొండ వాగులతో పాటు శబరి, ఇంద్రావతి, సీలేరు జలాలతో గోదావరికి ఎర్ర నీరు చేరింది. ఈ సీజన్‌లో చీర మీను (చిన్ని చేప పిల్లలు) ప్రత్యేకం. చీర నాలుగు కొసలు పట్టుకుని గోదావరిలో ముంచి పైకి తీస్తే చిన్న పిల్లల చిటికెన వేలి కంటె చిన్ని చేప పిల్లలు ఎగిరి పడుతుంటాయి. చీరతో పట్టుకునే చిన్ని చేప పిల్లలను చీర మీనం (చీర మీను)గా వ్యవహరిస్తారు. తల్లవరం, గాజులగొంది, పెద్దూరు గ్రామాల వారు  చిన్నాపెద్దా తేడా లేకుండా గోదావరిలో చీర మీను పడ తారు. ఏటా ఈ సీజన్‌లో చీర మీను రుచితో పాటు మంచి ఆరోగ్యమని చెబుతారు. పరీవాహక గిరిజన గ్రామాల్లో ప్రతీ ఒక్కరు చీర మీను పట్టుకుని తింటారు. మైదాన ప్రాంత పరీవాహక ప్రాంతాల్లో పట్టిన చీర మీను పట్టణాల్లో విక్రయిస్తారు.

Updated Date - 2021-07-22T05:09:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising