ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రాక్టర్‌కు రాయితీ

ABN, First Publish Date - 2021-01-20T05:48:13+05:30

రాయితీపై అందించే వ్యవసాయ పనిముట్ల జాబితాలో ట్రాక్టర్లను కూడా చేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వ్యవసాయ పనిముట్ల జాబితాలో ట్రాక్టర్లు 

గత బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి 

12 గ్రామాల గ్రూపులు దరఖాస్తులు 

ప్రక్రియ పూర్తి చేసేందుకు వ్యవసాయ శాఖ సిద్ధం

ఏలూరు రూరల్‌, జనవరి 19 : రాయితీపై అందించే వ్యవసాయ పనిముట్ల జాబితాలో ట్రాక్టర్లను కూడా చేర్చడానికి రాష్ట్ర  ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. రాయితీపై యంత్రాలను ఆందించడానికి గతంలోనే గ్రూపులను ఏర్పాటు చేశారు. ఈ గ్రూపుల  ద్వారా బ్యాంకు ఖాతాలు కూడా ఓపెన్‌ చేయించి యంత్రాలు మంజూరు చేయడమే తరువాయి అనుకుంటున్న సమయంలో ప్రభుత్వం రాయితీ జాబితా నుంచి ట్రాక్టర్‌ను తొలగించింది.  దీంతో  రైతులు రాయితీలేని యంత్రాలు తీసుకోవడానికి విముఖత వ్యక్తం చేశారు.  జిల్లా అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో ఉపకరణాల్లో ట్రాక్టర్‌ను చేర్చడానికి సూత్రపాయంగా అంగీకారం తెలిపింది. ఉపకరణాలు అందించే కంపెనీలకు గతంలో ఉన్న బకాయిల చెల్లింపులో కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. 


త్వరలో ఆర్‌బీకేలకు ట్రాక్టర్లు !

త్వరలో రైతు భరోసా కేంద్రాలకు ట్రాక్టర్‌పై ఉన్న సందిగ్ధత కూడా ప్రభుత్వం తొలగించడంతో పనిముట్లను చేర్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. రూ. 15 లక్షలు విలువైన యంత్రాలను రాయితీపై అందిస్తారు. ఈ మొత్తంలో 40 శాతం ప్రభుత్వం రాయితీ ఇస్తుండగా, 50 శాతం బ్యాంకు ద్వారా రుణ సదుపాయాన్ని కల్పిస్తా రు. మిగతా పది శాతాన్ని రైతు గ్రూపులు భరించాల్సి ఉంటుంది. ఇప్పటికే రబీ సీజన్‌ కూడా ముగింపు దశకు వచ్చింది. సాధ్యమైనం త  త్వరగా యంత్రాలను గ్రూపుల ద్వారా రైతు భరోసా కేంద్రాలకు చేరిస్తే ఉపయుక్తం గా ఉంటుందని రైతులు భావిస్తున్నారు. ఏలూ రు మండలంలో 12 గ్రామాల వారు గ్రూపులు గా పరికరాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గతంలో బకాయిలపై ప్రభుత్వం దృష్టి సారించ డంతో డీలర్లు ఆయా గ్రూపులకు కొటేషన్లు ఇవ్వడానికి అంగీకారం తెలిపారు. త్వరితగతిన ఈ ప్రక్రియ పూర్తి చేసి ఉపకరణాలు అందిం చేందుకు వ్యవసాయశాఖ సిద్ధమవుతుంది. 

Updated Date - 2021-01-20T05:48:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising