ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపే పోలింగ్‌..

ABN, First Publish Date - 2021-03-09T07:00:09+05:30

పట్టణంలో ఈనెల 10 నిర్వహించే మున్సిపల్‌ ఎన్ని కలకు ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్‌ కమిష నర్‌ కేవీ పద్మావతి తెలి పారు.

నిడదవోలు మున్సిపల్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

28 వార్డులకు 35 పోలింగ్‌ కేంద్రాలు

ఏర్పాట్లు పూర్తి

నిడదవోలు, మార్చి 8 : పట్టణంలో ఈనెల 10 నిర్వహించే మున్సిపల్‌ ఎన్ని కలకు ఏర్పాట్లు పూర్తి చేశామని మున్సిపల్‌ కమిష నర్‌ కేవీ పద్మావతి తెలి పారు. పట్టణంలోని పురుషు లు మహిళలు కలసి 33,614 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 28 వార్డులకు సంబంధించి 35 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 35 పోలింగ్‌ కేంద్రాల్లో 7 సెన్సిటివ్‌, 4 హైపర్‌ సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి సారించామన్నారు. 35 మంది పీవోలు, 105 మంది ఓపీవోలు, ఇద్దరు జోన్‌ ఆఫీసర్లు, ఐదుగురు రూట్‌ ఆఫీసర్లు, ఇద్దరు ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ అధికార్లు, ఇద్దరు సర్వలెన్స్‌ టీమ్‌ అధికారులు, ముగ్గురు మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాంట్రాక్ట్‌ అధికారులు మొత్తం 310 మంది విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

నేడు ఎన్నికల సామగ్రి పంపిణీ

మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి పోలింగ్‌ అధికారులు సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందజేస్తామని కమిషనర్‌ కేవీ పద్మావతి తెలిపారు.

విధుల్లో 200 మంది పోలీసులు 

సుమారు 200 మంది పోలీస్‌ అధికారులు విధులు నిర్వహిస్తున్నట్టు సీఐ కేఏ స్వామి తెలిపారు. ఎస్పీ పర్యవేక్షణలో డీఎస్పీ ఒకరు, సీఐ ఒకరు, ఎస్‌లు ఆరుగురు, ఏఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్ళు 27 మంది, కానిస్టేబుళ్ళు 61మంది, మహిళా పోలీసులు 28 మంది, హోమ్‌ గార్డులు 25 మంది, స్పెషల్‌ పార్టీ 40 మంది, మొబైల్‌ పార్టీలో డీఎస్పీ ఒకరు, సీఐ ఒకరు, ఎస్‌ ఐలు ఆరుగురు, స్పెషల్‌ ఫోర్స్‌, ప్రత్యేక దళాలు విధులు నిర్వహిస్తారన్నారు.


Updated Date - 2021-03-09T07:00:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising