ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రియ పొగాకు సాగు చేయాలి

ABN, First Publish Date - 2021-04-23T05:26:53+05:30

అంతర్జాతీయ మార్కెట్‌లో మన పొగాకుకు సరైన ధర పలకాలంటే పురుగు మందుల అవశే షాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని కేంద్ర పొగాకు బోర్డు చైర్మన్‌ యడపాటి రఘునాథరావు అన్నారు.

పొగాకు బేర్న్‌లీఫ్‌ పరిశీలిస్తున్న చైర్మన్‌ రఘునాథరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పొగాకు బోర్డు చైర్మన్‌ రఘునాథరావు

దేవరపల్లి, ఏప్రిల్‌ 22 : అంతర్జాతీయ మార్కెట్‌లో మన పొగాకుకు సరైన ధర పలకాలంటే పురుగు మందుల అవశే షాలు లేకుండా సేంద్రియ పద్ధతిలో సాగు చేయాలని కేంద్ర పొగాకు బోర్డు చైర్మన్‌ యడపాటి రఘునాథరావు అన్నారు. యర్నగూడెం గద్దే శ్రీనివాసరావు పొలంలో లూజ్‌ లీఫ్‌ బ్యారన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూసారాన్ని పెంచేందుకు పచ్చి రొట్ట ఎరు వులను పొలాల్లో చల్లాలని సూచించారు. రసాయనిక ఎరు వులు వాడటం వల్ల భూమి గుల్లబారుతుందని, సేంద్రియ ఎరువులు వేస్తే పొగాకు నాణ్యతతోపాటు అధిక ఉత్పత్తి సాధించుకోవచ్చన్నారు.ఈ బ్యారన్‌ నిర్మాణానికి రూ.9 లక్షలు ఖర్చయితే.. పొగాకు బోర్డు రూ.3 లక్షలు, ఐటీసీ కంపెనీ రూ.3 లక్షలు, జీపీఐ కంపెనీ రూ.లక్ష, రైతు రూ.2 లక్షలతో నిర్మించారన్నారు. బోర్డు రీజనల్‌ మేనేజర్‌ కేవీ.రాజ్‌ ప్రకాష్‌ మాట్లాడుతూ పొగాకు గరిష్ట ధర రూ.185 సరాసరి ధర రూ.169, కనిష్ట ధర రూ.163 పలుకుతుందన్నారు.  రైతులు అన్ని గ్రేడుల పొగాకును ఎప్పటికప్పుడు అమ్మకానికి పెట్టా లని సూచించారు. ఐటీసీ కంపెనీ లీఫ్‌ మేనేజర్‌ కల్యాణ రామిరెడ్డి, దేవరపల్లి వేలం నిర్వహణాధికారి జీఎల్‌కే ప్రసాద్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-04-23T05:26:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising