ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జనవరిలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు

ABN, First Publish Date - 2021-12-08T05:23:19+05:30

ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు జనవరి 6, 7, 8 తేదీలలో నిర్వహిస్తున్నట్లు పరిషత్‌ భీమవరం పాలకవర్గ మండలి చైర్మన్‌ కేశిరాజు శ్రీనివాస్‌ (గజల్‌ శ్రీనివాస్‌) తెలిపారు.

అంతర్జాతీయ తెలుగు సంబరాల బ్రోచర్‌ ఆవిష్కరిస్తున్న గజల్‌ శ్రీనివాస్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాళ్ళ, డిసెంబరు 7: ఆంధ్ర సారస్వత పరిషత్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు సంబరాలు జనవరి 6, 7, 8 తేదీలలో నిర్వహిస్తున్నట్లు పరిషత్‌ భీమవరం పాలకవర్గ మండలి చైర్మన్‌ కేశిరాజు శ్రీనివాస్‌ (గజల్‌ శ్రీనివాస్‌) తెలిపారు. పెదఅమిరం వెస్ట్‌బెర్రీ హైస్కూల్‌ ప్రాంగణంలో నిర్వహించే తెలుగు సంబరాల వివరాలు మంగళవారం ఆయన తెలిపారు. 13 శాఖల ద్వారా కార్యక్రమాన్ని నిర్వహించేందు కు ఉత్సవ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందన్నారు. జనవరి 3న భీమవరం వీరమ్మపార్క్‌ నుంచి జువ్వలపాలెం రోడ్డులోని ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ వరకు తెలుగు భాష వైభవ శోభాయాత్ర నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, గవర్నర్‌ హరిచంద్రన్‌ బిశ్వభూషణ్‌, మిజోరాం గవర్నర్‌ కె.హరిబాబు, కోన రఘుపతి, మండలి బుద్ద ప్రసాద్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు పా ల్గొంటారని తెలిపారు. హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌, సుప్రీం కోర్టు, హైకోర్టు న్యాయమూర్తులను ఆహ్వానించామన్నారు.

Updated Date - 2021-12-08T05:23:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising