టీచర్లకు పదోన్నతి కౌన్సెలింగ్
ABN, First Publish Date - 2021-10-29T05:30:00+05:30
టీచర్లకు అడహక్ పదోన్నతుల కౌన్సెలింగ్ శుక్రవారం ఏలూరు జడ్పీ మీటింగ్ హాలులో నిర్వహించారు.
వాదోపవాదాలు
ఏలూరు ఎడ్యుకేషన్, అక్టోబరు 29 : టీచర్లకు అడహక్ పదోన్నతుల కౌన్సెలింగ్ శుక్రవారం ఏలూరు జడ్పీ మీటింగ్ హాలులో నిర్వహించారు. స్కూల్ అసిస్టెంట్ కేడర్‌లో వివిధ సబ్జెక్టుల్లో మొత్తం 577 ఖాళీల్లో అర్హు లైన ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇవ్వ డం ద్వారా భర్తీ చేయడానికి రెండు రోజుల పాటు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. పదోన్నతి పొందిన టీచర్లకు నియామక పత్రాలను డీఈవో సీవీ రేణుక అందజేశారు. కౌన్సెలింగ్ నిర్వహణలో సాంకేతిక అభ్యంతరాలు తలెత్తడంతో వాటి పరిష్కారానికి డీఈఓ, ఉపాధ్యాయ సంఘాల నాయకులకు మధ్య కొద్దిసేపు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
Updated Date - 2021-10-29T05:30:00+05:30 IST