ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఇంటిపై దాడి అన్యాయం

ABN, First Publish Date - 2021-09-19T05:13:33+05:30

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేయడం అన్యాయమని పార్టీ మండల అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున ధ్వజమెత్తారు.

తాళ్లపూడి పైడిమెట్ట జంక్షన్‌లో ధర్నా చేస్తున్న టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే రమేష్‌తో పాటు అనుచరులను అరెస్ట్‌చేయాలి : టీడీపీ నాయకులు
ప్రధాన రహదారుల్లో నాయకుల ధర్నా

కొయ్యలగూడెం, సెప్టెంబరు 18 : మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడి చేయడం అన్యాయమని పార్టీ మండల అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున ధ్వజమెత్తారు. శనివారం కొయ్యల గూడెం ప్రధాన సెంటర్‌లో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  మాజీ ముఖ్యమంత్రి ఇంటిపై వైసీపీ రౌడీలు దాడి చేయడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్‌తో పాటు అనుచరులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో వినతిపత్రాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జ్యేష్ట రామకృష్ణ, ఏలూరు పార్లమెంట్‌ తెలుగు మహి ళా అధ్యక్షురాలు చింత ల వెంకటరమణ, జిల్లా కార్యదర్శి శ్రీను, నాగబాబు, గెడా గెరటయ్యబాబు, బొబ్బర చినరాజు, ముప్పానపల్లి వెంకటేశ్వరరావు, రాంబాబు పాల్గొన్నారు.


తాళ్లపూడి మండలంలో..

తాళ్లపూడి, సెప్టెంబరు 18:టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌ చేసిన దాడిని ఖండిస్తూ పార్టీ మండల నాయకులు శనివారం కదంతొక్కారు. పైడిమెట్ట జంక్షన్‌ వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రమేష్‌తో పాటు అనుచరులను అరెస్ట్‌చేయాలని డిమాండు చేశారు. నియోజకవర్గ రైతు కమిటీ అధ్యక్షుడు కొఠారు వెంకటరావు, యిల్లూరి బాబ్జి, పార్లమెంట్‌ ఉపాధ్యక్షుడు రాపాక తిలక్‌, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు నామా సురేంద్ర, విశ్రాంత ఎస్‌ఐ మద్దుకూరి సోసుందరరావు, తదితరులు పాల్గొన్నారు

Updated Date - 2021-09-19T05:13:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising