ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు నిర్బంధంపై నిరసన

ABN, First Publish Date - 2021-03-02T06:01:07+05:30

టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయు డుని నిర్బంధించడాన్ని నిరసిస్తూ సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు.

జంగారెడ్డిగూడెంలో టీడీపీ నాయకుల నిరసన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


జంగారెడ్డిగూడెం, మార్చి 1: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయు డుని  నిర్బంధించడాన్ని  నిరసిస్తూ సోమవారం జంగారెడ్డిగూడెం పట్టణంలో టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. అధికార పార్టీ అరాచకానికిది నిదర్శన మన్నారు. సీఎం డౌన్‌డౌన్‌, వైసీపీ అరాచకాలు నశించాలంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ పాందువ్వ రాజు, ఏలూరు పార్లమెంట్‌ ఇన్‌చార్జ్‌ గన్ని వీరాంజనేయులు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ, జయవరపు శ్రీరామూర్తి, రామ్‌కుమార్‌, ముస్తఫా, సత్తిపండు తదితరులు పాల్గొన్నారు.

కామవరపుకోట:  చంద్రబాబును పోలీసులు నిర్బంధించడం అన్యాయమని చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళీ ఖండించారు. సోమవారం కామవరపుకోటలోని తన నివాసంలో ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అప్రజాస్వామిక  పాలన  సాగిస్తోందన్నారు.  వైసీపీ ప్రభుత్వం నియంతృత్వ పాలనకు ఈ సంఘటన  నిదర్శనమన్నారు.  మండల టీడీపీ నాయకులు కిలారు సత్యనారాయణ, చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్‌ కోనే వెంకట సుబ్బారావు తదితరులు ఘటనను ఖండించిన వారిలో ఉన్నారు.

దేవరపల్లి: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్బంధంపై సోమవారం దేవరపల్లిలో మండల టీడీపీ ఆధ్వర్యంలో  ర్యాలీ నిర్వహించి  స్థానిక అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ముప్పిడి మాట్లాడుతూ చిత్తూరు వెళ్లేందుకు ఎయిర్‌పోర్టులో దిగిన చంద్రబాబును పోలీసులు నిర్బంధించడం  దారుణమన్నారు.  పార్టీ మం డల  అధ్యక్షుడు చినబాబు, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T06:01:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising