ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చట్టం అధికార పార్టీ చుట్టం: బాబ్జి ధ్వజం

ABN, First Publish Date - 2021-10-24T05:00:10+05:30

తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం ధ్వంసం చేయడంలో వైసీపీ, పోలీసుల పాత్ర ఉన్నదని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి ధ్వజమెత్తారు.

పోలీసుల తీరుకు నిరసనగా ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహిస్తున్న తెలుగుదేశం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తాడేపల్లిగూడెం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం రాష్ట్ర కార్యాలయం ధ్వంసం చేయడంలో వైసీపీ, పోలీసుల పాత్ర ఉన్నదని టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి ధ్వజమెత్తారు. కార్యాల యాన్ని ధ్వంసం చేసిన మూడు రోజుల తర్వాత పోలీసులు విచారణకు పూనుకోవడం సిగ్గు చేటన్నారు. తెలుగుదేశం అధికార ప్రతినిధి పట్టాభిని మాత్రం తొలిరోజే అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. చట్టం అధికార పార్టీ చుట్టంలా మారిందని విమర్శించారు. పోలీసుల తీరును నిరసిస్తూ తాడేపల్లి గూడెం టీడీపీ కార్యాలయం వద్ద ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.  తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ పోలీసుల తీరు అభ్యంతరకరంగా ఉన్నదని బాబ్జి  ఆందోళన వ్యక్తం చేశారు.  తమ పార్టీ అధినేత చంద్రబాబు దీక్షకు వెళ్లకుండా, బంద్‌ నిర్వహించకుండా ముందస్తు అరెస్ట్‌లు, నిర్బంధాలు చేసిన పోలీసులు వైసీపీ దీక్షలకు మద్దతు పలికారని బాబ్జి ఎండగట్టారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తున్న వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు పోలీసులు రక్షణ కవచంగా నిలిచారని విమర్శించారు.  నిరసన ప్రదర్శనలో తెలుగుదేశం ఆర్గనైజింగ్‌ కార్యదర్శి గొర్రెల ఽశ్రీధర్‌, పట్టణ అధ్యక్షుడు బడుగు పెద్ద, పెంటపాడు అధ్యక్షుడు కిలపర్తి వెంకట్రావు, నర్సాపురం పార్లమెంటరీ రైతు అధ్యక్షుడు పాతూరి రాంప్రసాద్‌ చౌదరి, యువత అధ్యక్షుడు మద్దిపాటి ధర్మేంద్ర, నియోజకవర్గ యువత అధ్యక్షుడు గంధం సతీష్‌, సర్పంచ్‌ పోతుల అన్నవరం, నియోజకవర్గ రైతు అధ్యక్షుడు పీతల సత్యనారాయణ, వాడపల్లి వెంకట సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు


Updated Date - 2021-10-24T05:00:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising