ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చంద్రబాబు ఇంటిపై దాడికి నిరసన

ABN, First Publish Date - 2021-09-19T05:12:58+05:30

సీఎం జగన్‌ మెప్పు కోసం చంద్రబాబు నివాసంపై జోగి రమేష్‌ దాడులకు దిగడం సరైన చర్య కాదని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ అన్నారు.

వీరవాసరంలో విలేకరులతో మాట్లాడుతున్న మెంటే పార్థసారథి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీసీలకు అపకీర్తి తెస్తున్న ఎమ్మెల్యే రమేష్‌ : అంగర


పాలకొల్లు అర్బన్‌, సెప్టెంబరు 18 : సీఎం జగన్‌ మెప్పు కోసం చంద్రబాబు నివాసంపై జోగి రమేష్‌ దాడులకు దిగడం సరైన చర్య కాదని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌ అన్నారు. ఎల్‌ఆర్‌పేటలోని ఆయన నివాసంలో శనివారం విలేక రులతో మాట్లాడారు. జోగి రమేష్‌ ప్రవర్తనతో బీసీలు తలెత్తుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. మంత్రి కావాలను కుంటే ప్రతిపక్ష నాయకులను అవమానించడం కాదని, వేరే దారి చూసుకోవా లన్నారు. రాష్ట్ర పోలీసులు తమ ఖాకీ దుస్తులు వదిలి వైసీపీ కార్యకర్తలుగా మారాలని సూచించారు.ఎమ్మెల్యే జోగి రమేష్‌ ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని సూచించారు.


 టీడీపీ నాయకులతో ఎమ్మెల్యే నిమ్మల సమావేశం


నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్య నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే డాక్టర్‌ నిమ్మల రామానాయుడు శనివారం సమావేశం నిర్వహించారు.   చంద్రబాబు నాయుడు నివాసంపై శుక్రవారం జరిగిన దాడి సంఘటనపై చర్చిం చారు. సమావేశంలో టీడీపీ పట్టణ, పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండ లాలకు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 


రాష్ట్రంలో ఆటవిక పాలన : మెంటే


వీరవాసరం,సెప్టెంబరు18: రాష్ట్రంలో ఆటవిక పాలన సా గుతుందని.. చంద్రబాబు  ఇం టిపైకి జోగి రమేష్‌ దండయాత్రకు వెళ్లడం హేయమైన చర్య అని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. వీరవాసరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మెంటే పార్థసారఽఽథి, కోళ్ళ నాగేశ్వరరావు, వేండ్ర శ్రీనివాస్‌ తదితరులు విలేకరులతో మాట్లాడారు. ఈ చర్యతో వైసీపీ నాయకులు, పోలీసులు సిగ్గుపడాలన్నారు.అనంతరం రాయకుదురులో జరిగిన పటాస్‌ పేలు డు సంఘటనను పరిశీలించి బాధితులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మండలశాఖ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్‌, వీరవల్లి శ్రీనివాస్‌, రాయపల్లి వెంకట్‌, వీరవల్లి చంద్రశేఖర్‌, కడలి వాసు తదితరులు పాల్గొన్నారు. 


టీడీపీ నాయకులపై దాడి దారుణం : బాలం


ఆచంట,సెప్టెంబరు 18 : ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేస్తే కట్టడి చేయాల్సిన అధికార పక్షమే ప్రతిపక్షంపై దాడి చేయడం దారుణమని ఆచంట నియోజకవర్గ తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బాలం వెంకట రమణ అన్నారు.చంద్రబాబు నివాసం వద్ద పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ దాడిని శనివారం ఖండించారు.  


Updated Date - 2021-09-19T05:12:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising