అక్రమంగా తరలిస్తున్న మద్యం స్వాధీనం
ABN, First Publish Date - 2021-07-10T05:42:43+05:30
అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నట్టు ఎస్‌ఈబీ ఏఎస్పీ జయరామరాజు తెలిపా రు.
ఉండ్రాజవరం, జూలై 9: అక్రమంగా మద్యాన్ని తరలిస్తున్న లారీని పట్టుకున్నట్టు ఎస్‌ఈబీ ఏఎస్పీ జయరామరాజు తెలిపా రు. శుక్రవారం ఉండ్రాజవరం లో ఆయన విలేకరులతో మాట్లా డుతూ మేఘాలయ నుంచి రూ. 7 లక్షల విలువైన 1834 మద్యం సీసాలను కోళ్ల మేతకు ఉపయోగించే ముడిసరుకు బాక్సుల్లో ఉంచి తరలిస్తుండగా తమకు అందిన సమాచారం మేరకు సత్యవాడ–కాల్దరి రోడ్డులో ఆగి ఉన్న లారీని తమ సిబ్బంది తనిఖీ చేసి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. తణుకుకు చెందిన లారీ డ్రైవర్ ఇజ్జాడ పాపినాయుడు, మోర్తకు చెందిన క్లీనర్ ఇజ్జాడ శ్రీనును విచారించగా తణుకు పట్టణానికి చెందిన అక్రమ మద్యం వ్యాపారి కల్లూరి రామకృష్ణ, అతని సహాయకుడు బాలాజీ మేఘాలయ నుంచి రాష్ట్రానికి అక్రమంగా మద్యం తెచ్చి తణుకు, పరిసర ప్రాంతాల్లో అమ్ముతున్నట్టు తెలిసిందని ఏఎస్పీ వివరించారు. మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని నిందితులు పాపినాయుడు, శ్రీనును అరెస్ట్ చేసినట్టు, సమాచారం అందించిన ఎస్‌ఈబీ సీఐ వెంకటేశ్వరరావు, ఎస్‌ఐ ఆదినారాయణ, హెచ్‌సీ రాంబాబు, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. తణుకు సీఐ చైతన్య కృష్ణ, ఎస్‌ఐ కె. రామారావు పాల్గొన్నారు.
Updated Date - 2021-07-10T05:42:43+05:30 IST