ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్క్‌ ఉంటేనే బీచ్‌కు అనుమతి

ABN, First Publish Date - 2021-10-27T05:26:15+05:30

కార్తీకమాసంలో బీచ్‌కు వచ్చే యాత్రికులు కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి.

అధికారులతో సమీక్షిస్తున్న సబ్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నరసాపురం, అక్టోబరు 26: కార్తీకమాసంలో బీచ్‌కు వచ్చే యాత్రికులు కచ్చితంగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలి. మాస్క్‌ లేనివారిని బీచ్‌కు అనుమ తించవద్దని సబ్‌ కలెక్టర్‌ అధికారులకు సూచించారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రసాదరాజుతో కలిసి మంగళవారం సబ్‌ కలెక్టర్‌ విష్ణు చరణ్‌ సమీక్ష నిర్వహించారు. కార్తీక మాసంలో పేరుపాలెం బీచ్‌కు 10 లక్షల మంది భక్తులు, యాత్రికులు వచ్చే అవకాశం ఉందన్నారు. దానికి అనుగుణంగా అన్నిశాఖల అధికా రులు ఏర్పాట్లు చేపట్టాలని సబ్‌ కలెక్టర్‌ సూచించారు. మాస్క్‌ ఉన్నవారిని మాత్ర మే బీచ్‌లోకి అఽనుమతించాలన్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని బీచ్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, విద్యుత్‌, జనరేటర్లు, పందిర్లను ఏర్పాటు చేయాలన్నారు. బీచ్‌లో మద్యం సేవించకుండా, బయట నుంచి తీసుకురాకుండా పోలీసులు నియంత్రించాలన్నారు.  గజ ఈతగాళ్ళు, లైఫ్‌జాకెట్లు ఫైర్‌, అంబులెన్స్‌, వైద్య శిబిరాలు సిద్ధంగా ఉంచాల న్నారు. ఎమ్మెల్యే ప్రసాదరాజు మాట్లాడుతూ కొవిడ్‌ వ్యాప్తి జరగకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. పార్కింగ్‌ స్థలాల్లో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపే విధంగా చూడాలని సబ్‌ కలెక్టర్‌కు విన్నవించారు. కార్యక్రమంలో డీఎస్పీ వీరాంజయరెడ్డి, డీఎల్‌పీవో నాగలత, డిప్యూటీ డీఎంహెచ్‌వో ప్రసాద్‌, తహసీల్దార్‌ హుసేన్‌, ఎంపీడీవో ఆనంద్‌కుమార్‌, మత్స్యశాఖ అధికారి ఏడుకొండలు, ఫైర్‌ అధికారి హనుమంతురావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-27T05:26:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising