ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అదే నిర్లక్ష్యం

ABN, First Publish Date - 2021-07-26T06:02:08+05:30

జిల్లాలో కొవిడ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే కేసుల సంఖ్య మే నెలలోకంటే తక్కువగా ఉండడంతో జనంలో ఏమరుపాటు కనిపిస్తోంది.

ఏలూరులో కిక్కిరిసిన ట్రాఫిక్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నిబంధనలు విస్మరిస్తున్న జనం

జిల్లాలో యథేచ్ఛగా ఫంక్షన్లు

భౌతిక దూరం పాటించని వైనం 

కిక్కిరిసిపోతున్న మార్కెట్లు, రోడ్లు

హైదరాబాద్‌ ప్రైవేటు బస్సులు ఫుల్‌

(తాడేపల్లిగూడెం–ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అయితే కేసుల సంఖ్య మే నెలలోకంటే తక్కువగా ఉండడంతో జనంలో ఏమరుపాటు కనిపిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులతో జనసంచారం యథా విధిగా మారుతోంది. మార్కెట్‌లు కిక్కిరిసిపోతున్నాయి. ఆర్టీసీల్లో పరిమితంగానే ప్రయాణికులను ఎక్కించుకుంటూ నిబంధనలు పాటిస్తున్నప్పటికీ ప్రైవేటు బస్సుల్లో నిబంధనలు కనిపించడం లేదు. జిల్లా మీదుగా రోజుకు 150 ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. హైదరాబాద్‌ వెళ్లే ప్రైవే టు బస్సులో తొలి నుంచీ పూర్తిస్థాయిలో సీట్లు భర్తీ చేస్తూ రాకపోకలు సాగిస్తున్నారు. అధికారులు దృష్టి సారించడం లేదు. రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే బస్సుల్లో  మాస్క్‌లు ధరించడం లేదు. మరోవైపు జిల్లాలోనూ ఇటీవల పుట్టిన రోజు వేడుకలు లాంటి ఫంక్షన్‌లు ప్రారంభించారు. బంధుమిత్రుల ను పిలిచి భోజనాలు పెడుతున్నారు. అనుమతులు లేకుండా నే ఫంక్షన్‌లు జరిగిపోతున్నాయి. భౌతిక దూరం కనుమరు గవుతోంది. రేషన్‌ షాపుల వద్ద, మద్యం షాపుల్లోనూ భౌతిక దూరాన్ని విస్మరిస్తున్నారు. మార్కెట్‌లు కిక్కిరిసిపోతున్నాయి. కేసులు పూర్తిస్థాయిలో తగ్గుముఖం పట్టకుండానే మార్కెట్‌లో జనసంచారం యథావిధిగా సాగుతోంది. జిల్లాలో ఒక్కోసారి రికవరీ కేసులకంటే నమోదవుతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి. 15 రోజుల నుంచి కేసులు నిలకడగా కొనసాగు తున్నాయి. కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం అధికంగా ఉన్నప్పు డు 2000లకు పైబడి కేసులు నమోదైన సందర్భాలున్నాయి. ఇప్పుడు 200 నుంచి 300 మధ్యలో నమోదవుతున్నాయి. కరోనా పరీక్షల సంఖ్య తగ్గితే కేసులు కాస్త తగ్గుముఖం పడు తున్నాయి. లేదంటే అధికంగా ఉంటున్నాయి. కనిష్ట స్థాయికి చేరుకోకపోవడంతో అధికార యంత్రాంగంలోనూ అందోళన వ్యక్తమవుతోంది. భౌతిక దూరం, మాస్క్‌లు ధరిం చాలన్న నిబంధన తప్పనిసరిగా పాటించాలి.  కేసులు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు పల్లెల్లోనూ మాస్క్‌లు ధరించి బయ టకు వచ్చే వారు. ఆ సంగతే మరిచిపోతున్నారు. బ్యాంకుల్లో నూ జనం కిక్కిరిసి ఉంటున్నారు. లాక్‌డౌన్‌ వేళల్లో సడలింపు లు ఇచ్చినా సరే భౌతిక దూరం పాటిస్తే జిల్లాలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది. తస్మాత్‌ జాగ్రత్త..!


Updated Date - 2021-07-26T06:02:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising