ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల నిర్మాణం తరితగతిన ప్రారంభించాలి : ఆర్డీవో

ABN, First Publish Date - 2021-04-13T06:19:12+05:30

కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన లేఅవుట్‌లలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఆర్డీవో లక్ష్మారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, ఏప్రిల్‌ 12 : కొవ్వూరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసిన లేఅవుట్‌లలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కొవ్వూరు ఆర్డీవో డి.లక్ష్మారెడ్డి అధికారులను ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయంలో డివిజన్‌ పరిధిలోని తహసీల్దార్లు, హెడ్‌వర్క్స్‌ అధికారులు, గృహనిర్మాణశాఖాధికారులతో సోమవారం స మావేశం నిర్వహించారు. డివిజన్‌లో 39,600 మందికి ఇళ్ల స్థల పట్టాలు అం దించామన్నారు. వారంతా త్వరితగతిన ఇళ్ల నిర్మాణం చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇళ్లస్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 90రోజుల లో పట్టాలు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. డివిజన్‌లో 111అంగన్‌వాడీ కేంద్రాల భవన నిర్మాణాలకు రూ.12.5 లక్షలు చొప్పున మంజూరయ్యా యన్నారు. వేసవి దృష్ట్యా డివిజన్‌ పరిదిలో చెరువులను ఈ నెల 18 నాటికి పూర్తిగా నింపాలన్నారు. అత్తిలి మండలంలో కొన్నిగ్రామాలలో చెరువులు మంచినీటితో నింపవలసి ఉందన్నారు. సమావేశంలో గృహ నిర్మాణశాఖా ఈఈ బి.తారాచంద్‌, గోదావరి వెస్ట్రన్‌ డివిజన్‌ ఈఈ ఎం.దక్షిణామూర్తి, హెడ్‌వర్క్స్‌ ఈఈ జి.శ్రీనివాసరావు తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising