ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా రంజాన్‌ వేడుకలు

ABN, First Publish Date - 2021-05-15T05:25:04+05:30

మండల గ్రామాల్లో శుక్రవారం రంజాన్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ముస్లిం సోదరులు కరోనా నిబంధనల మేరకు స్వగృహాల్లోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.

నిడదవోలులో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవిడ్‌ నిబంధనలతో ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు
గణపవరం, మే 14: మండల గ్రామాల్లో శుక్రవారం రంజాన్‌ పండుగను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ముస్లిం సోదరులు కరోనా నిబంధనల మేరకు స్వగృహాల్లోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. గురు వారం రాత్రి నెలవంక చూసి శుక్రవారం ఈద్‌ నమాజ్‌ ముందే ముస్లింలు దాన ధర్మాలు చెల్లించారు. అనంతరం ఇళ్లలోను, మసీదులోనూ కొవడ్‌ నిబంధనల మేరకు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్షీర సేమియా, బిర్యానీలు, ముస్లింలతో పాటు అక్కడక్కడ హిందువులు భుజించారు. మండలంలో గణపవరం, పిప్పర, మొయ్యేరు, అర్థవరంలో ముస్లింలు షాపింగ్‌ కూడా తక్కువ మందితోనే నిర్వహించుకున్నారు.
నిడదవోలులో..
నిడదవోలు, మే 14 : ముస్లింల పర్వదినమైన రంజాన్‌ను శుక్రవారం ప్రత్యేక పార్ధనలతో జరుపుకున్నారు. కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి కారణంగా ముస్లింలందరూ సాధ్యమైనంతవరకు వారి గృహాల్లోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పట్టణ, మండల గ్రామాల్లో భౌతికదూరం పాటిస్తూనే పాటిస్తూ ఒకరి కొకరు ఈద్‌ ముబారక్‌ తెలుపుకున్నారు.
ఉండ్రాజవరంలో..
ఉండ్రాజవరం, మే 14 :మండలంలో ముస్లిం సోదరులు శుక్రవారం రంజాన్‌ వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కరోనా నేపథ్యంలో నిబంధ నలు పాటిస్తూ ఇంటి వద్దే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉండ్రాజవరం, మోర్త, వేలివెన్ను, చిలకంపాడు, చివటం గ్రామాల్లో ప్రార్థనలు చేశారు.
అత్తిలిలో..
అత్తిలి, మే 14 : అత్తిలి మండలంలో రంజాన్‌ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మసీదు మత గురువులు నమాజ్‌ చదివారు. రంజాన్‌ పర్వదిన విశిష్టతను వివరించారు. కరోనా దృష్ట్యా ఎక్కువ మంది ముస్లింలు తమ ఇళ్ల వద్ద నుంచి రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకున్నారు.
నిడమర్రులో..
నిడమర్రు మే 14 : రంజాన్‌ పండుగను ముస్లింలు కరోనా నిబంధనల మేరకు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ముస్లింలకు ఇష్టమైన శుక్రవారం రంజాన్‌ పండుగ రావడంతో మసీదులతో పాటు తమ ఇళ్ల వద్ద ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించారు. క్రొవ్విడి మసీదులో కొద్దిమందితో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఈద్‌ ముబారక్‌ చెప్పుకున్నారు.
ఇరగవరంలో..
ఇరగవరం, మే 14 : ప్రభుత్వ నిబంధనల మేరకు కొవిడ్‌ దృష్ట్యా రంజాన్‌ మాసం ప్రారంభం నుంచి మండలంలోని మసీదులలో ప్రార్థనలు నిలిపివేశారు. కర్ఫ్యూ అమలులో ఉన్నప్పటికీ నెలరోజుల పాటు నిష్టగా ఉపవాసదీక్షలు చేపట్టారు. శుక్రవారం రంజాన్‌ పర్వదిన్నాన్ని పురస్కరిం చుకుని సామాజిక బాధ్యతను, ఆరోగ్య సూత్రాలను పాటిస్తూ ఇళ్లల్లోనే రంజాన్‌ పండుగను  జరుపుకున్నారు. కరోనా నుంచి అల్లాహ్‌ విశ్వమాన వాళిని కాపాడాలని ముస్లింలు పవిత్ర ప్రార్థనలు నిర్వహించారు.

Updated Date - 2021-05-15T05:25:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising