ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల ఖాతాల్లో సొమ్ములు

ABN, First Publish Date - 2021-10-27T05:20:30+05:30

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంటరుణాలు, –వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద చెల్లింపులను సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు.

కలెక్టరేట్‌లో యంత్ర పరికరాల సబ్సిడీ విడుదల చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు సిటీ, అక్టోబరు 26: వైఎస్‌ఆర్‌ రైతు భరోసా– పీఎం కిసాన్‌, వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంటరుణాలు, –వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద చెల్లింపులను సీఎం వైఎస్‌ జగన్మోహనరెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారు. ఈ సంరద్భంగా నిర్వహించిన వీడియో కాన్ఫ రెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ కార్తికేయ మిశ్రా మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ రైతు భరోసా –పీఎం కిసాన్‌ పథకాల కింద వరుసగా మూడో ఏడాది రెండో విడతగా 3లక్షల 11 వేల 987 మంది రైతులకు రూ.68.08 కోట్లు వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశామన్నారు. వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పంట రుణాలు పథకం కింద 78 వేల 417 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో 7 కోట్ల 59 లక్షల రూపాయలు వడ్డీ రాయితీగా జమ చేశారన్నారు. వైఎస్‌ఆర్‌ యంత్ర సేవా పథకం కింద జిల్లాలో 110 రైతు గ్రూపులకు రూ.9.03 కోట్లుతో కొనుగోలు చేసిన యంత్ర పరికరాలకు రూ. 3.38 కోట్లు సబ్సిడీ విడుదల చేశారన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఎంపీ మార్గాని భరత్‌, ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, ఎలీజా, తలారి వెంకట్రావు, జడ్పీ చైర్మన్‌ కవురు శ్రీనివాస్‌,  రైతులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-27T05:20:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising