ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలపై నిరసన

ABN, First Publish Date - 2021-02-09T05:22:27+05:30

విశాఖ ఉక్కు–ఆంద్రుల హుక్కు నినాదంతో, త్యాగాల పునాదులపై నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వబోం అంటూ సీపీఎం, సీసీఐ, ఫార్వర్డ్‌బ్లాక్‌, ప్రజా సంఘాలు నినదించాయి.

ప్రకాశంచౌక్‌లో నిరసన తెలుపుతున్న వామపక్ష నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం అర్బన్‌, ఫిబ్రవరి 8: విశాఖ ఉక్కు–ఆంద్రుల హుక్కు నినాదంతో, త్యాగాల పునాదులపై నిర్మించుకున్న విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటుపరం కానివ్వబోం అంటూ సీపీఎం, సీసీఐ, ఫార్వర్డ్‌బ్లాక్‌, ప్రజా సంఘాలు నినదించాయి. ప్రకాశం చౌక్‌ సెంటర్‌లో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం మాట్లాడతూ దేశ ప్రజల ఆస్థి అయిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రభుత్వ భిక్ష కాదని, పోరాట ఫలితంగా ఏర్పడిందని గుర్తుచేశారు. 32మంది వీరుల త్యాగం, వేలాది మంది అరెస్టుల ఫలితంగా విశాఖ ఉక్కు ప్యాక్టరీ ఏర్పడితే బీజేపీ ప్రభుత్వం ఒక్క కలం పోటుతో ఫ్యాక్టరీని బడా కార్పోరేట్‌ వ్యక్తులకు దోచి పెట్టేందుకు పూనుకుందని దుయ్యబట్టారు. విశాఖ ఉక్కు ప్యాక్టరీపై ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు జీవనం సాగిస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి దాదాపు 20వేల ఎకరాల భూములు, లక్షల కోట్లు విలువ చేసే ఫ్యాక్టరీని కేవలం కొంత మంది ప్రయోజనాల కోసం ప్రైవేటుపరం చేయడాన్ని తాము అంగీకరించబోమన్నారు. ప్రజలందరూ విశాఖ ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఫార్వర్డ్‌బ్లాక్‌ నాయకులు లంకా కృష్ణమూర్తి, సీపీఐ నాయకులు చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాం ప్రసాదు, గంటా సుందర్‌ కుమార్‌, జెఎన్‌వీ గోపాలన్‌, బి వాసుదేవరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-09T05:22:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising