ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా హీరో ప్రభాస్‌ జన్మదిన వేడుకలు

ABN, First Publish Date - 2021-10-24T05:33:53+05:30

మొగల్తూరు నుంచి వెళ్లి సినీ ప్రస్థానం ప్రారం భించిన ప్రభాస్‌ ప్రపంచ దేశాల్లో కీర్తిని సాధించారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు.

ప్రభాస్‌ స్వగ్రామం మొగల్తూరులో కేక్‌ కట్‌ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొగల్తూరు,అక్టోబరు 23 : మొగల్తూరు నుంచి వెళ్లి సినీ ప్రస్థానం ప్రారం భించిన ప్రభాస్‌ ప్రపంచ దేశాల్లో కీర్తిని సాధించారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు. యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ జన్మదిన వేడుకలు  ప్రభాస్‌ స్వగ్రామం మొగల్తూరులో శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అభిమాన సంఘాల కన్వీనర్‌ చింతపల్లి రవి, రాయుడు శ్రీరాములు, శ్రీరాజా కలిదిండి కుమార్‌ బాబు, గ్రంధి రాంబాబు,అండ్రాజు రామన్న, బస్వాని ఏడుకొండలు, ఎంపీటీసీ తిరుమాని స్వామి, ఆదినారాయణ పాల్గొన్నారు. 


పాలకొల్లు అర్బన్‌/ నరసాపురం రూరల్‌ : అన్న క్యాంటీన్‌ వద్ద శనివారం తో 309వ రోజు ప్రభాస్‌ అభిమానులు సుమారు 500 మందికి భోజనాలు ఏర్పా టు చేశారు.అభిమాన సంఘ నాయకులను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పెచ్చెట్టి వెం కట నరసింహారావు (బాబు) సత్కరించారు. నరసాపురం మండలం సీతా రాం పురం గ్రామంలో ప్రభాస్‌ జన్మదిన కేక్‌ను  జేవీఅర్‌ కట్‌ చేసి అభిమా నులకు స్వీట్లు పంచారు.కార్యక్రమంలో యేషయ్య, వర్మ, దుర్గా పాల్గొన్నారు.


భీమవరం అర్బన్‌ : నేషనల్‌ స్టార్‌గా ప్రభాస్‌ ఆసియా ఖం డంలో రెండో స్టానాన్ని సంపాదించుకుని ఖ్యాతి గడించారని ప్రభాస్‌ ఫాన్స్‌ జిల్లా అధ్యక్షుడు ఉండి వాసు అన్నారు. భీమవరం 37వ వార్డు రజక పేట మునిసిపల్‌ కమ్యూనిటీ హాల్‌లో శనివారం స్వచ్ఛంధ రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా ప్రభాస్‌ జన్మదిన కేక్‌ కట్‌ చేసి అభిమానులకు పంచారు. స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో ధరణి వలంటీర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ సెంటర్‌కు 40మంది రక్తదానం చేశారని సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రిక మూర్తి, గాదిరాజు వెంకటేశ్వరరాజు, పీవీ రామరాజు, ధరణి బ్లడ్‌ బ్యాంక్‌ శిరీష్‌, పోడూరి రమణ, చించినాడ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-24T05:33:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising