ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవర్‌ కట్‌

ABN, First Publish Date - 2021-10-12T05:29:02+05:30

జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు పెరిగాయి. బొగ్గు కొరత కారణంగా ఽథర్మల్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో జిల్లాకు వచ్చే విద్యుత్‌ కోటా కూడా తగ్గిపోవడంతో కోతలు విధించాల్సి వస్తోందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 జిల్లాలో అధికారికంగా విద్యుత్‌ కోతలు 

 పడిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి

 వినియోగం తగ్గించాలంటున్న అధికారులు

 సాయంత్రం 6 నుంచి రాత్రి 10 వరకు ఏసీలు వద్దు

 వ్యవసాయ, ఆక్వా సర్వీసులకు సరఫరా బంద్‌ 


ఏలూరుసిటీ, అక్టోబరు 11: జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు పెరిగాయి. బొగ్గు కొరత కారణంగా ఽథర్మల్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో జిల్లాకు వచ్చే విద్యుత్‌ కోటా కూడా తగ్గిపోవడంతో కోతలు విధించాల్సి వస్తోందని విద్యుత్‌శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచిస్తు న్నారు. కొవిడ్‌ కారణంగా విదేశాలలో బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. దీంతో ఇండోనేషియా తదితర దేశాల నుంచి దిగు మతి చేసుకునే బొగ్గు సరఫరా తగ్గిపోయింది. స్థానికంగా ఉత్పత్తయ్యే బొగ్గు ఇక్కడ అవసరాలకు సరిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. బొగ్గు నిల్వలు అంతంత మాత్రంగా ఉండటంతో థర్మల్‌ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోతోంది. జిల్లాకు రోజు వారీ సరఫరా అయ్యే విద్యుత్‌ కోటా 17.50 మిలియన్‌ యూనిట్లు. ఇది అవసరాలకు సరిపడా రాకపో వడంతో జిల్లాలో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ కోతలు విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సాధారణంగా రోజువారీ 19.73 మిలియన్‌ యూనిట్లు వరకు విద్యుత్‌ వినియోగం ఉంటుంది. ఆదివారం జిల్లాకు 17.50 మిలి యన్‌ యూనిట్లు మాత్రమే సరఫరా అవగా దీంతో దాదాపు 2.23 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ లోటు ఏర్పడింది. విద్యుత్‌ ఉత్పత్తి మరింత తగ్గితే కోతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతు న్నారు. దీంతో ప్రజల్లో ఇప్పుడే ఆందోళన మొదలైంది. యలమంచిలి, నిడమర్రు, ఇరగవరం మండలాల్లో రోజూ రాత్రి వేళల్లో రెండు గంటల పాటు కరెంటు కోతలు విధిస్తున్నారు. ఉండ్రాజవరం మండలంలో పరిశ్రమలకు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు కోత విధిస్తున్నారు. ఆకివీడులో సోమవారం 5 గంటలు, పెర వలిలో రెండున్నర గంటలపాటు విద్యుత్‌ నిలిపివేశారు.


పొదుపుగా వాడాలి

ఎన్‌ జనార్దనరావు, ఏపీ ఈపీడీసీఎల్‌  ఎస్‌ఈ

విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యుత్‌ వాడకంలో ఏసీ వాడకం తగ్గించాలి. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గృహ, వాణిజ్య అవసరాల్లో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఏసీలు వినియోగించ రాదు. పరిశ్రమలలో కూడా సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు కేవలం లైటింగ్‌ లోడ్‌ను మాత్రమే వినియోగించాలి. ఉత్పత్తికి సంబంధించి జనరేటర్లు వినియోగించాలి. ఆక్వా, వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులకు సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విద్యుత్‌ సరఫరా నిలుపుదల చేస్తారు. 

Updated Date - 2021-10-12T05:29:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising