ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలపై విద్యుత్‌ చార్జీల మోత

ABN, First Publish Date - 2021-10-20T04:50:52+05:30

విద్యుత్‌ చార్జీ లను విపరీతంగా పెంచుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలను మోపుతుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాథాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏలూరులో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వొత్తులతో టీడీపీ నిరసన ర్యాలీ 

ఏలూరు టూటౌన్‌, అక్టోబరు 19 : విద్యుత్‌ చార్జీ లను విపరీతంగా పెంచుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారాలను మోపుతుందని తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాథాకృష్ణయ్య (చంటి) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ చార్జీల పెంపునకు నిరసనగా 28వ డివి జన్‌ కార్పొరేటర్‌ తంగిరాల అరుణ ఆధ్వర్యంలో బీడీ కాలనీలో మంగళవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చంటి మాట్లా డుతూ ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని జగన్మోహన్‌ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. ఈ రెండున్నరేళ్ల కాలంలో ఇప్పటి వరకూ ఆరు సార్లు విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలను దారుణంగా వంచించారన్నారు. విద్యుత్‌ చార్జీల శ్లాబ్‌లు కూడా మార్చివేసి విద్యుత్‌ ఛార్జీల పెరుగుదలకు కూడా కారణమయ్యారన్నారు. ట్రూ అప్‌ చార్జీల పేరుతో వేల కోట్లు వసూలు చేశా రన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రతిఘటించేసరికి ట్రూఅప్‌ చార్జీలను నిలుపుదల చేశారన్నారు. ఇప్పటికే వసూలు చేసిన ట్రూఅప్‌ చార్జీలను ప్రజ లకు తిరిగి ఇవ్వాలన్నారు.  ప్రతి ఇంట్లో లోడ్‌ పెరి గిందని డిపాజిట్లు సేకరించడం మొదలు పెట్టార న్నారు. మాటిమాటికి విద్యుత్‌ చార్జీలు పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తున్నార న్నారు. ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఉద్య మం చేపట్టిందన్నారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించే వరకూ పోరాటం ఆగదన్నారు. టీడీపీ పార్టీ కార్యా లయ సమన్వయ కార్యదర్శి పాలి ప్రసాద్‌, యుడా మాజీ చైౖర్మన్‌ ఉప్పాల జగదీష్‌ బాబు,మాజీ కార్పొ రేటర్‌ చోడే వెంకటరత్నం, దాకారపు రాజేశ్వరరావు, తంగిరాల సురేష్‌,ఆర్‌ఎన్‌ఆర్‌ నాగేశ్వరరావు, పూజారి నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు.  


Updated Date - 2021-10-20T04:50:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising