ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీస్‌ స్టేషన్‌కు టీడీపీ అభ్యర్థులు

ABN, First Publish Date - 2021-02-27T06:32:32+05:30

రోజురోజుకూ అధికార పార్టీ దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ తరఫున నామినేషన్‌ వేసి కార్పొరేటర్‌ అభ్యర్థుల ను బెదిరిస్తున్నారు. సంబంధం లేని కేసుల విచారణ పేరుతో పోలీస్‌ స్టేషన్‌కు కార్పొరేటర్‌ అభ్యర్థులను తీసుకు వెళ్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 

పాత కేసులంటూ విచారణ.. అడ్డుకున్న పార్టీ నాయకులు

ఏలూరు టూటౌన్‌, ఫిబ్రవరి 26: రోజురోజుకూ అధికార పార్టీ దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. టీడీపీ తరఫున నామినేషన్‌ వేసి కార్పొరేటర్‌ అభ్యర్థుల ను బెదిరిస్తున్నారు. సంబంధం లేని కేసుల విచారణ పేరుతో పోలీస్‌ స్టేషన్‌కు కార్పొరేటర్‌ అభ్యర్థులను తీసుకు వెళ్తున్నారు. స్టేషన్‌లోపల విచారణ పేరుతో పార్టీ మారాలని ఒత్తిడి తెస్తున్నారు. శుక్రవారం 6వ డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్ధి మాకాల రమేష్‌, 19వ డివిజన్‌ అభ్యర్ధి పైడి వెంక ట్రావులను రూరల్‌ పోలీసులు బలవంతంగా స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. మీపై పాత కేసులున్నాయంటూ విచారణ మొదలెట్టారు. విషయం తెలుసుకున్న టీడీపీ ఏలూ రు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బడేటి చంటి ఇద్దరు లాయర్లను వెంట పెట్టుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్ళి మావాళ్ళని ఎందుకు తీసుకు వచ్చారని ప్రశ్నించారు. లాయర్లు కూడా ఏ సెక్షన్‌ కింద వీరిని తీసుకువచ్చారని ప్రశ్నించే సరికి ఇద్దరు అభ్యర్థులను విడిచిపెట్టారు. అవసరమైతే విచారణకు రావాలని పోలీసులు తెలి పారు. ఏకగ్రీవాలు చేయాలనే ఆతృతతో టీడీపీ నాయకులను బెదిరిస్తున్నారని మాకాల రమేష్‌, పైడి వెంకట్రావు ఆరోపించారు.  


Updated Date - 2021-02-27T06:32:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising