ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివి : డీఎస్పీ శ్రీనాథ్‌

ABN, First Publish Date - 2021-10-22T04:54:54+05:30

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని డీఎస్పీ బి.శ్రీనాథ్‌ అన్నారు.

కొవ్వూరులో డీఎస్పీ, సిబ్బంది నివాళి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొవ్వూరు, అక్టోబర్‌ 21: విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని డీఎస్పీ బి.శ్రీనాథ్‌ అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం లాంచీలరేవు నుంచి ఎల్‌ఐసీ కార్యాలయం వరకు పట్టణ, మండల పోలీసులు ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ శ్రీనాథ్‌ మాట్లాడుతూ పది రోజులపాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. పట్టణ, రూరల్‌ సీఐలు పి.సునీల్‌కుమా ర్‌, వైవి.రమణ, ఎస్‌ఐలు కె.వెంకటరమణ, జి.సతీష్‌, సిబ్బంది పాల్గొన్నారు.


పోలవరం: యువత రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని సీఐ అల్లు నరసింహమూర్తి పిలుపునిచ్చారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గురువారం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అమర వీరులకు నివాళులర్పించారు. 40 సార్లు రక్తదానం చేసిన ఎస్‌పీఎఫ్‌ కాని స్టేబుల్‌ పి.రాజశేఖర్‌ను అభినందించారు. 37 మంది రక్తదానం చేశారు. సర్పంచ్‌ పొడుం పుష్ప, ఎంపీడీవో సీహెచ్‌.శ్రీనివాస్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-22T04:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising